
పోగొట్టుకున్న 50 వేల రూపాయల నగదును, బాధితుడిని కనిపెట్టి అడిషనల్ డీసీపీ ఏ. లక్ష్మీనారాయణ (శాంతి & భద్రతలు) చేతుల మీదుగా అప్పగించిన రామడుగు పోలీసులు.
నిజాయితీని చాటుకున్న రామడుగు మండలం గుండి గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎస్ శ్రీనివాస్.
కరీంనగర్ రామడుగు మండలం గుండి గ్రామంలో పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్న ఎస్ శ్రీనివాస్ విధులకు హాజరయ్యేందుకు కరీంనగర్ నుండి రామడుగు మండలానికి చెందిన గుండి గ్రామానికి వెళ్తుండగా రామడుగు గ్రామ శివారులోని కొత్తగా నిర్మించిన బ్రిడ్జి వద్ద యాభై వేల రూపాయల నగదు దొరికింది. ఈ విషయాన్నీ స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కి తెలిపాడు. విషయాన్నీఫోన్ ద్వారా పోలీసులకు తెలిపిన స్థానిక ఎమ్మెల్యే , బాధితులను కనిపెట్టి ఈ డబ్బును వారికి అందజేయవల్సిందిగా కోరారు. విషయాన్నీ తెలుసుకుని వెంటనే స్పందించిన పోలీసులు బాధితుడిని కనిపెట్టారు.
సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చీర్లవంచ గ్రామానికి చెందిన గంగు ఎల్లయ్య (55) గా గుర్తించారు. బాధితుడు గంగు ఎల్లయ్య తమ గ్రామంలో నిర్మించిన పెద్దమ్మతల్లి దేవాలయానికి గాను విగ్రహాల కొనుగోలుకై రామడుగు కు వస్తుండగా మార్గమధ్యలో డబ్బును పోగొట్టుకున్నాడని బాధితుడు పోలీసులకు తెలిపాడు. ఈ డబ్బును పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్ నుండి తీసుకుని కరీంనగర్ అడిషనల్ డీసీపీ ఏ. లక్ష్మీనారాయణ (శాంతి & భద్రతలు) చేతుల మీదుగా బాధితుడు గంగు ఎల్లయ్య కు అందజేశారు.
ఈ కార్యక్రమంలో చొప్పదండి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రకాష్, రామడుగు ఎస్సై శేఖర్ ఇతర గ్రామస్థులు వున్నారు.
