Spread the love

మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని వేయి స్థంబాల ఆలయంలో ఎంపీ డా..కడియం కావ్య ప్రత్యేక పూజలు

పవిత్ర మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని చారిత్రాత్మకమైన వేయి స్తంభాల ఆలయంలో శ్రీ రుద్రేశ్వర స్వామిని పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి తో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రుద్రేశ్వరుడికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు.

మొదటగా ఆలయానికి చేరుకున్న ఎంపీ, ఎమ్మెల్యేలకు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. పూజలు చేసిన తర్వాత అర్చకులు తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. అనంత‌రం సిద్దేశ్వరాలయాన్ని సంద‌ర్శించి పూజలు చేశారు. పరమ శివుడు రాష్ట్ర ప్రజలను సంతోషంగా చూడాలని ఆకాంక్షించారు. అనంతరం ఎంపీ డా. కడియం కావ్య మీడియాతో మాట్లాడుతూ… తెలుగు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. శివరాత్రి ఉపవాస పూజలను భక్తి ప్రపత్తులతో నిర్వహిస్తున్న భక్తులకు ఆ దేవ దేవుని ఆశీర్వాదం ఎల్లవేళలా వుండాలని కోరుకున్నారు. చరిత్రాత్మకంగా ఎంతో ప్రసిద్ధి చెందిన వేయి స్తంభాల గుడి అభివృద్ధి కృషి చేస్తాను ఎంపీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.