Spread the love

అన్న క్యాంటీన్ సందర్శించిన మునిసిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు

చిలకలూరిపేట : పట్టణంలోని పురుషోత్తమ పట్నం నందు ఉన్న అన్న క్యాంటీన్ ను బుధవారం నాడు మున్సిపల్ కమీషనర్ పి . హరి బాబు సందర్శించి అక్కడే టిఫిన్ చేసి నాణ్యతను పరిశీలించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమీషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం అతి తక్కువ రుసుము తో నాణ్యమైన పలహారాలను అందుబాటులో ఉంచిందని పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రత్యేక చొరవతో మూడు అన్నా క్యాంటీన్ ల ద్వారా వీలైనంత ఎక్కువ మందికి ఆకలి బాధలు లేకుండా నాణ్యమైన భోజనం అందు బాటులో ఉంచటం జరిగింది, కావున అన్ని వర్గాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు కూడా, ప్రభుత్వము ప్రతిష్టాత్మకం అన్న క్యాంటీన్ లను నిర్వహణను చేపట్టిందని అని తెలిపారు.
తదుపరి అన్న క్యాంటీన్ పరిసరాలు శుభ్రంగా ఉండేటట్టు చర్యలు తీసుకోవాలని అక్కడ సిబ్బంది కి ఆదేశించారు