
కాలనీ అభివృద్ధిలో సంక్షేమ సంఘానికి నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది : బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద 126 – జగద్గిరిగుట్ట డివిజన్ మైసమ్మ నగర్ – బి “సృజన వెల్ఫేర్ అసోసియేషన్” నూతన కమిటీ సభ్యులు బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సంధర్బంగా బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ…. మైసమ్మ నగర్ – బి నూతన సంక్షేమ సంఘం సభ్యులకు నా అభినందనలు. కాలనీ అభివృద్ధిలో సంక్షేమ సంఘం ఎంతో కీలకమన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జగన్, డివిజన్ ప్రెసిడెంట్ రుద్ర అశోక్, జగద్గిరి గుట్ట వేంకటేశ్వర స్వామి దేవస్థానం మాజీ ఛైర్మన్ వేణు యాదవ్, నాయకులు మెట్ల శ్రీను, ప్రెసిడెంట్ బసప్ప గుప్త, ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, కోశాధికారి శ్రీకాంత్ యాదవ్, ఉపాధ్యక్షులు రాములు, మాజీ కోశాధికారి సంతోష్, బస్తీ వాసులు పాపిరెడ్డి, హన్మంతు, నాగార్జున, ప్రేమ్ సాయి, చింటు, శ్రీనివాస్ రెడ్డి మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
