
అనాలోచిత నిర్ణయాల వల్లే జనానికి నీటి కష్టాలు
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆగ్రహం
ట్యాంకర్ యజమానుల సమస్యలపై చర్చలు
- నిజాంపేట కార్పొరేషన్ పరిధిలో తమ సమస్యలను ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు దృష్టికి తీసుకెళ్లిన ట్యాంకర్ల యాజమానులు,డ్రైవర్లు
- కొత్త ఆంక్షలతో ప్రభుత్వం వేధిస్తోందని, అందువల్లే నీటి సరఫరాను ఆపేశామని డ్రైవర్లు ఎమ్మెల్సీ దృష్టికి తీసుకెళ్లారు.
- ట్యాంకర్ల యజమానులు, డ్రైవర్ల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు వెంటనే అధికారులతో మాట్లాడారు.
- ప్రభుత్వానికి, అధికారులకు ముందు చూపులేకపోవడం వల్లే నీటి కొరత ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు
- మోటార్లకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి తేవడం, ట్యాంకర్లకు అదనంగా ఫీజులు కట్టాలని బెదిరించడం ఏంటని నిలదీశారు.
- పైగా ట్యాంకర్ల యజమానులు వేల రూపాయల డిపాజిట్లు కట్టాలని ఆంక్షలు పెట్టడం ఏంటని ప్రశ్నించారు.
- వేసవి పెరిగి నీటి కొరత ఏర్పడిన ఈ సమయంలో ఈ ఆంక్షలు ప్రజలకు మరిన్ని నీటి కష్టాలకు కారణం అవుతోందన్నారు.
- ప్రభుత్వం, అధికారులు ముందుచూపుతో వ్యవహరిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.
- ప్రభుత్వం నీటిని సరఫరా చేయకపోగా ప్రజలకు ప్రైవేట్ ట్యాంకర్లు అందుబాటులో లేకుండా చేయడం దారుణమని మండిపడ్డారు.
- ప్రభుత్వం చేయలేని పనిని ట్యాంకర్లు చేస్తుంటే అడ్డుకోవడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు.
- వెంటనే ట్యాంకర్లపై ఒత్తిడి మానేసి ప్రజల నీటి కష్టాలను తొలగించాలని సూచించారు.
