Spread the love

ప్రముఖ గాయని శ్రీమతి కల్పన ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసి, హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్ రావు మరియు హోలిస్టిక్ హాస్పిటల్లో CEO డాక్టర్ సుబ్బారావు తో కలిసి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, “శ్రీమతి కల్పన ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడం బాధాకరం అని, ఆమె త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని అలానే ఆమెకు ప్రభుత్వం తరఫున, నా తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తాము అని చెప్పడం జరిగింది, శ్రీమతి కల్పన ప్రస్తుతం వైద్యుల సమాచారం ప్రకారం ఆమె ఆరోగ్య పరిస్థితి కుదుట పడుతుంది అని, రెండు రోజుల్లో ఆమె మరింతగా కోలుకుంటుంది, ఆమెకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు అని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్ రావు చెప్పడం జరిగింది.