Spread the love

దక్షిణ భారత దేశంలో ఎంపీ సీట్లు తగ్గిస్తే దేశం విచ్ఛిన్నం అవుతుంది..

నిధులు తీసుకెళ్లినా భరిస్తున్నాం.. సీట్లు తగ్గిస్తే ఎవరూ ఊరుకోరు..

1971 సెన్సెక్స్​​‍ ఆధారంగానే ఎంపీ స్థానాల పునర్విభజన జరుగుతుందేమో..

అందుకే హోం మంత్రి అమిత్‌షా సీట్లు తగ్గవని ప్రకటించారనుకుంటా..

కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌..

దక్షణాది రాష్ట్రాల్లో పునర్విభజనలో భాగంగా పార్లమెంట్‌ సీట్లు తగ్గిస్తే దేశం విచ్ఛిన్నం అవుతుందని మాజీ పార్లమెంట్‌ సభ్యులు, బీఆర్‌ఎస్ సీనియర్‌ నాయకులు బోయినపల్లి వినోద్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు. కరీంనగర్‌లోని వాణీనికేతన్‌ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకున్న వినోద్‌కుమార్‌ అనంతరం స్థానిక మీడియాతో మాట్లాడారు. దక్షిణ భారత దేశంలో జనభా లెక్కల ప్రకారం పార్లమెంట్‌ సీట్లు తగ్గిస్తే ఎవ్వరు ఊరుకొరని అన్నారు. అయితే, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా చేసిన వాఖ్యల ప్రకారం చూస్తే సీట్లు తగ్గించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం లేదని అనుకోవల్సి వస్తోందన్నారు. ప్రస్తుత జనాభా ప్రాతిపదికన పార్లమెంట్‌ నియోజకవర్గాల పునర్విభజన చేపడితే ఉత్తరాదికంటే దక్షిణ భారతంలో సీట్లు తగ్గుతాయని తమిళనాడు సీఎం స్టాలిన్‌ చేసిన ప్రతిపాదనలో వాస్తవం ఉందన్నారు. దీనిపై అఖిలపక్షాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారన్నారు. స్టాలిన్‌తోపాటు చంద్రబాబు మరింత ముందుకెళ్లి సీఎంలు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని దక్షిణ భారత దేశ పౌరులకు విజ్ఞప్తి చేసిన విషయాన్ని కూడా గుర్తు చేశారు.

పార్లమెంట్‌ స్థానాల పునర్విభజనలో దక్షిణ భారత దేశంలో సీట్లు తగ్గుతాయని స్టాలిన్‌ చెప్పిన విషయంలో వాస్తవం ఉందని, అలాగే సీట్లు తగ్గవని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చెప్పిన విషయంలోనూ వాస్తవం ఉందని అన్నారు. ఎందుకంటే 1971లో డిలీమిటేషన్‌ ప్రకటించిన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అప్పట్లోనే దక్షిణ భారత దేశంలో జనాభా తగ్గుతుందన్న విషయాన్ని గమనించి రాజ్యాంగ సవరణ చేశారని, 20 ఏండ్ల వరకు 1971 సెన్సెక్స్​​‍ ప్రకారమే పార్లమెంట్‌ స్థానాలు కొనసాగాలని రాజ్యాంగ సవరణ తెచ్చారని అన్నారు. 2001లో వాజ్‌పాయ్‌ ప్రభుత్వం మరో ఈ రాజ్యాంగ సవరణను 25 ఏండ్ల వరకు కొనసాగేలా సవరణ చేసిన విషయాన్ని మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ గుర్తు చేశారు. 2026తో ఈ గడువు ముగుస్తుందని, తిరిగి రాజ్యాంగ సవరణ చేసే ఉద్దేశంతోనే దక్షిణ భాతర దేశంలో పార్లమెంట్‌ సీట్లు తగ్గవని ప్రకటన చేసి ఉంటారని తాను భావిస్తున్నానని స్పష్టం చేశారు. జనాభా లెక్కల ప్రకారం దక్షిణ రాష్ట్రాల్లో సీట్లు తగ్గుతాయని తమిళనాడు సీఎం స్టాలిన్‌, బీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్న వాఖ్యలు కరెక్టేనని తెలిపారు. అదే విధంగా అమిత్‌ షా సీట్లు తగ్గవని చేసిన ప్రకటనలు కూడ కరెక్టేనని అనుకొవచ్చునని అయితే దానికి గతంలో చేసిన రాజ్యాంగ సవరణను కొనసాగించాలన్నారు. 2026లో మరోసారి రాజ్యాంగ సవరణ చేసి పార్లమెంట్‌ సీట్ల పెంపు విషయంలో 1971లోని నిష్పాత్తి కొనసాగించాలన్న ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని తాను భావిస్తున్నానని తెలిపారు. అందుకే అమిత్‌ షా అలాంటి ప్రకటనలు చేశారని అనుకుంటున్నట్లు తెలిపారు.

అలాంటి చట్టానే కేంద్ర ప్రభుత్వం 2026లో తీసుకువస్తుందని భావిస్తున్ననని పేర్కొన్నారు. ఇదే జరిగితే పార్లమెంట్‌లో సీట్లు పెరిగిన కూడ 1971లోని నిష్పాతిలోనే సీట్లు పెరుగుతాయని తెలిపారు. జనాభాతో సంబంధం లేకుండా 1971లోని సెన్స్​‍స్ను బేస్ సంవత్సరంగా తీసుకుంటారని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. హోం మంత్రి ఇప్పుడొక మాట అని మళ్లీ రేపు ఇంకోక మాట చేస్తే తప్పకుండా దక్షిణాది రాష్ట్రాలు ఊరుకొవని, రాష్ట్రాల జనాభా సంఖ్య ఆదారంగా పార్లమెంట్‌ సీట్లు కేటాయిస్తామంటే దేశ విచ్చినానికి బీజేపీ నాంది పలుకుతుందని ఆరోపించారు. ఇప్పటికే ఆర్థికంగా దక్షణ భారతదేశం నుంచి డబ్బులు తీసుకొని పొయి ఉత్తర దేశానికి పెడుతున్నారన్న ఓ వాదన ఉందన్నారు. అది తాను అంటున్నది కాదని ఈ విషయాన్ని నీతిఆయోగ్‌, ప్లానింగ్‌ కమిషన్‌ కూడ చెప్పుతున్నాయన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి రూ.100 కేంద్రానికి ఇస్తే తిరిగి రూ.49 మాత్రమే తెలంగాణకు ఇస్తుందన్నారు. అదే ఉత్తరప్రదేశ్‌ రూ.100 కేంద్రానికి ఇస్తే ఆ రాష్ట్రానికి రూ.499 ఇప్తున్నదని, అలాగే బీహార్‌ రూ.100 కేంద్రానికి ఇస్తే వారికి రూ. 600 తిరిగి ఇస్తున్నదని అన్నారు. దక్షిణ భారతంలోని డబ్బులు ఉత్తర భారత దేశానికి తీసుకపోతున్నారని అయినా ఒకే దేశంగా భావించాల్సి వస్తోందన్నారు. అదే పార్లమెంట్‌ సీట్లు తగ్గిస్తే ఎవ్వరు ఊరుకొరని స్పష్టం చేశారు.

పట్టభద్రుల సమస్యలకు పరిమితం కాకుండా, విద్యా విధానంపై, నైపుణ్యత పెంచే విషయంపై ఎమ్మెల్సీలు గెలవాల్సినా అవసరం ఉందన్నారు.

రాష్ట్రంలో నూతన ఓరవడిలో విద్యా విధానం కొనసాగించాల్సినా అవసరం ఉందన్నారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌ తదితరులు వినోద్‌కుమార్‌ వెంట ఉన్నారు..