
డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి తో సర్పంచుల సంఘం జే.ఏ.సీ. ప్రతినిధుల భేటీ
వనపర్తి
సర్పంచుల సంఘం రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతినిధులు సీఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో జరిగిన ఈ భేటీలో సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.
సర్పంచుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన చిన్నారెడ్డి వారి వినతి పత్రంపై ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఎండార్స్మెంట్ చేయడం జరిగింది.
