Spread the love

ఐసీఐసీఐ బ్యాంకు కేసులో సింగ్ అజిత్ అరెస్ట్

విజయవాడ న్యాయస్థానంలో హాజరుపరిచిన పోలీసులు మార్చి 13 వరకు రిమాండ్ ఇవ్వడంతో నెల్లూరు జైలుకు తరలింపు,ఐసీఐసీఐ బ్యాంకులో గత మేనేజర్ నరేష్ తాను ఒక్కడినే తప్పు చేయలేదని ఆత్మహత్య చేసుకుంటానంటూ ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. నరేష్ ఖాతాదారుల నుంచి కొట్టేసిన నగదు వేర్వేరు ఖాతాల ద్వారా రూ.35కోట్లు మురికిపూడికి చెందిన అజిత్, అతని తల్లి సుజాత ఖాతాలకు పంపినట్లు సీఐడీ అధికారులు గుర్తిం చారు. అజిత్ ఇంటికి సీఐడీ అధికారులకు వెళ్లిన సమయంలో విధులకు ఆటంకం కలిగించాడని చిలకలూరిపేట గ్రామీణ పోలీసు స్టేషన్లోనూ సీఐడీ అధికారులు ఫిర్యాదు చేశారు.