Spread the love

పని ప్రదేశాలలో మహిళలను లైంగికంగా వేధిస్తే కఠిన చర్యలు…………………….*జిల్లా న్యాయ
సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ వి. రజిని

వనపర్తి : పని ప్రదేశాలలో మహిళలను లైంగికంగా వేధిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ న్యాయమూర్తి వి రజని అన్నారు వనపర్తి జిల్లాలోని మున్సిపల్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు చట్టాలపై అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది ఈ సదస్సులో ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు ప్రైవేటు ప్రభుత్వ ఇతర కార్యాలయాల్లో కచ్చితంగా నలుగురితో కూడిన ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు నలుగురిలో ఇద్దరు మహిళలు ఉండాలని మరియు ఈ కమిటీలో సంస్థలోని సీనియర్ మహిళ ప్రిసైడింగ్ ఆఫీసర్ గా నియమించబడుతారు

ఏ మహిళ అయినా లైంగికంగా వేధించబడితే ఈ కమిటీలు ఫిర్యాదు చేస్తే నిజానిజాలు పరిశీలించి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది బాధితురాలు యొక్క సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారు కావున పని ప్రదేశాలలో లైంగికంగా వేధించబడిన మహిళలు ధైర్యంగా కార్యాలయంలో ఉన్న ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలలో ఫిర్యాదులు చేయాలని కోరారు అదేవిధంగా మహిళా హక్కులను చట్టాలను గురించి వివరించారు మరియు అన్ని వర్గాల మహిళలందరికీ కూడా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఉచిత న్యాయ సేవలు అందిస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇంజనీర్ యూనస్ బార్ వైస్ ప్రెసిడెంట్ డి కృష్ణయ్య డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ జి ఉత్తరయ్య పాల్గొన్నారు