
ఏడాదిన్నరలోపు విభిన్న ప్రతిభావంతులందరికీ ఉపకరణాలు అందజేస్తాము : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
కేంద్ర ప్రభుత్వం, అలింకో సంస్థ ఆధ్వర్యంలో ఉచిత ఉపకరణాలు పంపిణీ
ఎంపి కేశినేని చొరవతో 715 మంది ఉపకరణాలు అందజేత
కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ లక్ష్మీశ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్,
విజయవాడ : గత ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల సమస్యలు పట్టించుకోలేదు. ఎన్టీఆర్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా విభిన్న ప్రతిభావంతులకు కావాల్సిన ఉపకరణాల గుర్తింపు కేంద్ర ప్రభుత్వం 2022 లోనే ఎంపిక పూర్తి చేయటం జరిగింది. గత మూడేళ్లుగా ఎంపిక చేసిన వారికి ఉపకరణాల పంపిణీ చేయకుండా నిర్లక్ష్య వైఖరితో గత ప్రభుత్వం వ్యవహరించింది. ఇది ప్రజా ప్రభుత్వం…మీరు కోరుకునే విధంగా పనిచేస్తుంది. మీ అండగా వుంటూ మీ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తుందని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు..
ఎన్టీఆర్ జిల్లా, కేంద్ర ప్రభుత్వం, కృత్రిమ అవయవాల తయారీ సంస్థ(ALIMCO) అలింకో సంస్థ సహకారం తో విజయవాడ ఎంపి కేశినేని శివనాధ్ (చిన్ని) ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులకు వీల్ చైర్స్, ట్రై సైకిల్, కృత్రిమ అవయవాలు పంపణి కార్యక్రమం శుక్రవారం మొఘల్ రాజపురంలోని సిద్దార్ధ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కలెక్టర్ లక్ష్మీశ, విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కామరాజు పాల్గొన్నారు.
విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాలకు చెందిన 715 మంది విభిన్న ప్రతిభావంతులకి వారికి అవసరమైన బ్యాటరీ నడిచే ట్రై సైకిల్స్, వీల్ చైర్స్, చంక కర్రలు, చెవిటి మిషన్లు, కృతిమ అవయవాలు, క్యాలిపర్స్ వంటి ఉపకరణాలు ఉచితంగా అందజేయటం జరిగింది.
ఈ కార్యక్రమంలో 140 మందికి బ్యాటరీ నడిచే మూడు చక్రముల బండ్లు, 121 మంది మూడు చక్రముల సైకిళ్లు, 8 మందికి సి.పి చైర్లు, 71 మందికి వీల్ చైర్లు, 87 మందికి చంక కర్రలు, 128 మంది వినికిడి యంత్రాలు, 29 మందికి ఏం.ఎస్.ఐ.డి కిట్లు, 20 మందికి రోల్లెటర్లు, 20 మందికి చేతి కర్రలు, మరో91 మందికి వారికి అవసరమైన ఉపకరణాలు దాదాపు కొటి నాలుగు లక్షల రూపాయల విలువ చేసే ఉపకరణాలు ఉచితంగా అందించటం జరిగింది.
విభన్న ప్రతిభావంతులకి ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని), కలెక్టర్ లక్ష్మీశ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ లు కలిసి ఉపకరణాలు అందజేశారు. ఈ సందర్బంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ విభన్న ప్రతిభావంతులకు వారి అవసరాలకు సరిపడా ఉపకరణాలు అందించటం చాలా సంతోషంగా వుందన్నారు. కేంద్రం 2022 లో విభన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు ఉచితంగా ఇవ్వాలని జాబితా తయారుచేస్తే గత ప్రభుత్వం దీన్ని పట్టించుకున్నదాఖాలలు లేవన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే విజయవాడ ఎంపిగా తాను జిల్లాలోని ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ , జిల్లా అధికారులతో కలిసి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసేందుకు కృషి చేయటం జరిగిందన్నారు. రెండు నెలల క్రితమే వీటిని హైదరాబాద్ నుంచి తెప్పించటం జరిగింది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల కొంత ఆలస్యం జరిగిందన్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే విభన్న ప్రతిభావంతులకు చెప్పినట్లు ఆరు వేల రూపాయలు పెన్షన్ గా అందచేస్తున్నారు.అలాగే పెన్షన్ తో పాటు మీ ఆత్మవిశ్వాసం మరింత పెరిగేందుకు అవసరమైన ఉపకరణాలు అందచేస్తున్నారని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలో విభన్న ప్రతిభావంతులందరికీ ఉపకరణాలు అందిలా ప్రతి మూడు నెలలకొకసారి ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తానని మాట ఇచ్చారు. జిల్లా అభివృద్దిలో తమ కంటే కలెక్టర్ లక్ష్మీశ రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారని కొనియాడారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నిత్యం ప్రజల మధ్య వుంటూ ప్రజల సమస్య పరిష్కారం పనిచేస్తారని పేర్కొన్నారు.
గత ప్రభుత్వం రాజకీయ నాయకులు ఎక్కడ వుండేవారో ఎవరికి తెలిసేది కాదని, ప్రజా ప్రభుత్వంలో తామందరం అధికారుల్లాగా ప్రజల మధ్యనే వుంటూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు.
కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ కేంద్రం నుంచి జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు రావాల్సిన ఉపకరణాలు మంజూరు కోసం ఎంపి కేశినేని శివనాథ్ చూపిన చొరవ తెలియజేశారు. జిల్లా అభివృద్దికి కావాల్సిన సహాయ సహకారాలు అందించటంలో వెనకడుగు వేయనని తెలిపారు.
ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) కృషి వల్ల కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉపయోగించి ఎన్టీఆర్ జిల్లాను అభివృద్ది పథంలో నడిపించేందుకు చేస్తున్న కృషిని వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎపి బిల్డింగ్స్ అండ్ అదర్ కన్స్ స్ట్రక్షన్స్ వర్కర్స్ అడ్వైజర్ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు, కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి, కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు , అలింకో సంస్థ ప్రతినిధి రవిశంకర్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
