రాజీవ్ గాంధీకి నివాళులర్పించిన ప్రధాని మోదీ

రాజీవ్ గాంధీకి నివాళులర్పించిన ప్రధాని మోదీ

PM Modi pays tribute to Rajiv Gandhi రాజీవ్ గాంధీకి నివాళులర్పించిన ప్రధాని మోదీదివంగత రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. ‘వర్ధంతి సందర్భంగా మన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి నా నివాళులు’ అని ట్వీట్ చేశారు. కాగా, రాజీవ్ గాంధీ 1984-1989 మధ్య ఇండియాకు ప్రధానిగా పని చేశారు. 1991లో తమిళనాడులోని శ్రీపెరంబదూరులో LTTE ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురయ్యారు.

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి అస్సాం సీఐడీ త్వరలో సమన్లు జారీ చేయనున్నట్లు సమాచారం

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి అస్సాం సీఐడీ త్వరలో సమన్లు జారీ చేయనున్నట్లు సమాచారం

గువహటి: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి అస్సాం సీఐడీ త్వరలో సమన్లు జారీ చేయనున్నట్లు సమాచారం. ఆయన సారథ్యంలోని ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’ గత నెల గువహటిలోకి ప్రవేశించిన వేళ పార్టీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. దీనిపై రాహుల్‌ను సీఐడీ విచారించనుంది.ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లో రాహుల్‌తో పాటు సీనియర్‌ నేతలు కేసీ వేణు గోపాల్‌, జితేంద్ర సింగ్‌, జైరాం రమేశ్‌, శ్రీనివాస్‌ బీవీ, కన్హయ్య కుమార్‌, గౌరవ్‌ గొగొయ్‌, భూపేన్‌…

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరైంది

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరైంది

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరైంది. 2018 నాటి పరువు నష్టం కేసులో రాహుల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ సుల్తాన్‌పూర్‌లోని ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. కాగా, ఎన్నికల ప్రచార సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై రాహుల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని విజయ్ మిశ్రా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.