
విద్యశాఖకు మంత్రి లేని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం: మెతుకు ఆనంద్
వికారాబాద్ జిల్లా కేంద్రంలో *కొత్తగడి గురుకుల పాఠశాలలో టీచర్ల వేధింపులు భరించలేక 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యయత్నానికి యత్నించింది. తరచూ టీచర్ వేధింపులతో మనోవేదనకు గురైన తబిత అనే విద్యార్థిని పాఠశాల మొదటి అంతస్తు నుంచి దూకడంతో ఎడమ కాలుకు ఫ్రాక్చర్ అయ్యింది.
వికారాబాద్ జిల్లా నవాబుపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో 250 మందికిపైగా విద్యార్థినులు ఉన్నారు. ఇక్కడ ఫిబ్రవరి 24వ తేదీన నలుగురిని ఎలుకలు కరువగా 27వ తేదీన మరో నలుగురిని కరిచాయి. విద్యార్థినుల సంఖ్యకు తగినట్లుగా పాఠశాలలో స్థలం లేకపోవడంతో ఇరుకు గదుల్లో నిద్రిస్తున్న విద్యార్థినులను ఎలుకలు కరిచాయి.
ఈ సందర్బంగా వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ స్పందిస్తూ…
రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు సర్వసాధారణమైపోయాయి.
ఒక వసతి గృహంలో విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం అంటే అక్కడ ఉన్న పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు, ఇలాంటి సంఘటనలు మిగతా విద్యార్థుల మీద తీవ్ర ప్రభావం చూపిస్తాయి.
తరచూ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం వార్తలు వినిపిస్తూనే ఉన్నా… ప్రభుత్వ వసతి గృహాల్లో ఎప్పటికప్పుడు విద్యార్థుల మానసిక స్థితిని గమనించడానికి, సరైన సమయంలో సరైన దిశా నిర్దేశం చేయడానికి కౌన్సిలర్లను నియమించి కౌన్సిలింగ్ ఇప్పిస్తే ఇలాంటి సంఘటనలు దాదాపు అరికట్టవచ్చు.
రాష్ట్రంలో కల్తీ లేని ఆహారం కోసం విద్యార్థులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నా ..
కొన్ని ప్రదేశాల్లోని వసతి గృహల్లో పిల్లలు పాములు, తేల్లు, ఎలుకల కాటుకు గురవుతూనే ఉన్నా….
అన్నం కోసం కిలోమీటర్ల దూరం నడుస్తున్నా…
ఇలాంటి ఎన్ని సంఘటనలు చూసినా ప్రభుత్వంలో చలనం మాత్రం రావడం లేదు
రాష్ట్రంలోని పలు హాస్టల్ లలో ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు ఆసుపత్రి పాలైన ఘటన లాంటి ఎన్నో సంఘటనలు మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉన్నాయి.
ప్రధాన ప్రతిపక్ష పార్టీగా BRS నాయకులు ఎన్ని సార్లు విద్యార్థుల సమస్యలను లేవనెత్తిన…. విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ప్రభుత్వానికి ఎన్నిసార్లు పిల్లల సమస్యల మీద తమ గోడు వినిపించినా…
పత్రికలు మరియు మీడియా ఎన్నిసార్లు విద్యార్థుల సమస్యలపై గళం వినిపించినా..
ఈ ప్రభుత్వంపై దున్నపోతు మీద వర్షం పడినట్లే అయింది
ప్రస్తుతం విద్యా వ్యవస్థలో పర్యవేక్షణ లోపించింది.
విద్యార్థినులను ఇబ్బంది పెడుతున్న కొంతమంది ఉపాధ్యాయులపై చర్యలు ఏవి?
రాష్ట్రంలో వరుసగా ఇలాంటి ఎన్ని ఘటనలు జరిగిన, ఎంత మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుంది.
ఇకనైనా ఈ ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్రంలో విద్యావ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయిపోతుంది
ఇకనైనా ప్రభుత్వం మొద్దునిద్ర వీడి విద్యార్థుల మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రధాన ప్రతిపక్షంగా వికారాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా హెచ్చరిస్తున్నాను.
