Spread the love

పరమేశ్వరుడు పేరు పెట్టుకున్న ఈ “మహేశ్వరుడి” కాంపౌండ్ లో సరస్వతి రోదిస్తుంది.
దొర గారి ఆదాయం అంతా ఇన్పుటే,అవుట్ ఫుట్ ఏమీ ఉండదు.
మండల, జిల్లా, రాష్ట్రస్థాయి విద్యాధికారులు వీరి కాంపౌండ్ వరకు బానిసలుగా, పాలేర్లుగా, వ్యవహరిస్తున్నారు.

చిలకలూరిపేట:( సాక్షిత టౌన్ )ఓ కాలేజి యజమాని, వ్యాపార దిగ్గజం, సుమారు 99 సంవత్సరాలు ప్రభుత్వ స్థలమైన పాత బస్టాండ్ ను, అద్దెకు తీసుకొని వ్యాపార సముదాయాన్ని ఏర్పాటు చేసుకొని వారందరి వద్ద నెలవారి ఆదాయం పొందుతూ ప్రభుత్వానికి చెల్లించవలసిన పైకం చెల్లించకుండా, వ్యాపార సముదాయాల ముందు ప్రభుత్వ స్థలాన్ని కూడా వారి తాత గారి జాగీరులా అద్దెలకు ఇచ్చుకుని అడ్వాన్సులు అద్దెల రూపంలో వసూలు చేస్తూ గణనీయంగా సంపాదనకు అలవాటు పడిన ఈ అపర కుబేరుడు న్యాయవ్యవస్థకు దొరకడు,అధికారులనుకను సైకల్లోనే మాయ చేయగల మహా మేధావి, అధికారుల నాయకుల వ్యసనాలను పసిగట్టి వారిని జోలపాడి నిద్రపుచ్చగల నేర్పరి. ఈ పొట్టి వామనమూర్తి.
గుంజుకుని తినేవాడికి ఎప్పుడు కడుపు నిండదు, నలుగురికి పంచుతూ తినేవాడికి ఎప్పటికీ ఆకలి ఉండదు, అనే చిన్న విషయాన్ని గమనించలేని అజ్ఞాని. ఎస్బిఐ చీఫ్ రజనీష్ కుమార్ ఎకనామిక్స్ టైమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్యాంకుల్లో పేరుకుపోయిన మొండిబకాయలన్ని ప్రైవేటు వాళ్ళవే, ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ ఎక్కడ అప్పులు ఎగ్గొట్టిన దాఖలాలు లేవుఅన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీ కరించాలంటూ కొద్ది రోజులుగా వస్తున్న వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. అప్పులు ఎగ్గొట్టే వాళ్లే ముందు వరుసలో కూర్చొని నీతి సూత్రాలు వల్లిస్తున్నారు. ఇక్కడ వ్యవహారం అంతా దొంగలే,దొంగా…. దొంగా అని అరుస్తున్నట్లు వారి వ్యవహారం ఉందని, ప్రవేట్ రంగంలో పాలన విధానాలు బాగుంటే అప్పులు ఎందుకు వేగ వేస్తున్నారని ఆయన తమ ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే సదరు దొరగారు పేద విద్యార్థులకు తమ విద్యా సంస్థలో విద్య అభ్యసించేందుకు అవకాశం ఉన్నప్పటికీ ఏ ఒక్కరికి అవకాశం ఇవ్వకపోవడం గమనించదగిన విషయం. అంతేగాక సమాజాన్ని ఉద్ద రిస్తానని ప్రతిపక్ష అధికార పార్టీల నుంచి అవకాశాలను పొందిన సదరు దొరగారు స్త్రీ లోలుడు, వ్యసనపరుడు, పరమేశ్వరుడు పేరు పెట్టుకున్న ఈ మహేశ్వరుడు కాలేజీలోనే పలువురు పాత్రికేయులకు అధికారికంగా దొరకటం, వార్తల్లో వ్యక్తిగా ప్రచారం పొందటం పట్టణ ప్రజలు,నియోజవర్గ ప్రజలుకు తెలిసిన విషయం, నియమ నిబంధనలు ను తుంగలో తొక్కి వ్యాపార వ్యవహారాలు నిర్వహించగల ఘణాపాటి. స్టెల్లార్లలో ప్రాథమిక విద్య, బహుళ అంతస్తు భవనాలలో ఇంటర్మీడియట్,డిగ్రీ కళాశాలను ఎటువంటి రక్షణ,అనుమతులు, ఆట స్థలాలు లేకుండా విద్యాలయాలు, కళాశాలలు,నిర్వహిస్తుంటారు. తన.డిగ్రీ కాలేజీ లో విద్యార్థులకు పరీక్షా కేంద్రం కేటాయిస్తే మండలంలోని మద్దిరాల గ్రామంలో విద్యార్థులచే పరీక్షలు రాయిస్తుంటాడు.అలాగే ఇంటర్మీడియట్, డిగ్రీ, దూరవిద్యా కేంద్రాల వ్యవహారంలో కూడా అవినీతి జీడిపాకం వలె సాగుతూనే ఉంది. అయినప్రశ్నించే అధికారులు గానీ, తల్లిదండ్రులు గాని , బాలల సంరక్షణ విభాగం వారు కానీ ప్రశ్నించేందుకు ఏ మాత్రం సాహసం చేయరు. ఎందుకంటే “ఆది నుంచి ఆకాశం మూగది, అనాదిగా తల్లిదరణీమూగది.” విద్యార్థుల ఫీజులు చెల్లింపు విధానం లేటుఅయినట్లయితే పాఠశాల కళాశాలల గేట్లు ముందు నిలబెట్టడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. తాను ఆర్థికంగా బలపడేందుకు కులం, మతం, అధికార, ప్రతిపక్ష పార్టీలు, అధికారులను, తన వ్యాపార కూడలిలో ఉన్న వసతి( బస తి, లాడ్జి ) ను కూడా విరివి గా వినియోగించారు. ఇంత జరుగుతున్నా, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి విద్యాశాఖ అధికారులు ఇతగాడి కాంపౌండ్ వైపు కన్నెత్తి చూడకపోవడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.