
మాజీ సర్పంచ్ కావటి మల్లయ్య పార్థివదేహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి…….
చిల్పూర్ మండలం శ్రీపతిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కావటి మల్లయ్య మరణించగా వారి పార్థివదేహానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కావటి మల్లయ్య లాంటి మంచి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఎమ్మెల్యే వెంట స్థానిక ప్రజా ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.
