Spread the love

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ఆయా డివిజన్ల లో నెలకొన్న పలు సమస్యలు,పెండింగ్ పనులు,చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారుల తో సమీక్షా సమావేశం నిర్వహించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని శేరిలింగంపల్లి సర్కిల్, చందానగర్ సర్కిల్, కూకట్పల్లి సర్కిల్ పరిధిలోని ఆయా డివిజన్ల లలో నెలకొన్న పలు సమస్యలకు పరిష్కారాలు మరియు చేపట్టే పలు అభివృద్ధి పనుల తో ,ప్రజల ఇబ్బందులను తీర్చే విదంగా చర్యలు చేపట్టే విధంగా పలు సూచనలు ఇచ్చారు.అసంపూర్తిగా మిగిలిపోయిన పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలనీ, అభివృద్ధి కార్యక్రమాల పై సమీక్షా నిర్వహించి చేపట్టవలసిన పనులలో జాప్యం నివారణకు చర్యలు చర్చించనైనది మరియు చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలు మరియు అసంపూర్తిగా మిగిలిపోయిన పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలనీ, అదేవిధంగా ప్రజల సౌకర్యార్థం ప్రథమ ప్రధాన్యతగా పనులు చేపట్టాలని, కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, శంకుస్థాపన చేసిన పనులలో జాప్యం నివారణకు చర్యల పై సమీక్షా సమావేశం జరపడం జరిగినది. రోడ్లు, నాలా నిర్మాణ పనులు, పార్క్ లు ఏవైతే పెండింగ్ లో ఉన్నవో వాటిని త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని అదేవిధంగా టెండర్లు పూర్తయిన పనులను వెంటనే పనులు చెప్పట్టాలని PAC చైర్మన్ గాంధీ చెప్పడం జరిగినది. యుద్ధప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ అదేశించడం జరిగినది. పనులలో జాప్యాన్ని సహించే ప్రసక్తే లేదని, పనులు తీసుకొని జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్ల పై చర్యలు తీసుకోవాలని ,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కల్గకుండా చూడాలని ,మౌలిక వసతుల కల్పనలో అలసత్వం ప్రదర్శించకుండా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని,కొత్త ప్రతిపాదనలు తీసుకురావాలని ,శేరిలింగంపల్లి నియోజకవర్గ సమగ్ర అభివృద్దే ధ్యేయంగా పనిచేయాలని PAC చైర్మన్ గాంధీ అధికారులను ఆదేశించడం జరిగినది .

ఈ సమీక్షా సమావేశం లో జిహెచ్ఎంసి అధికారులు EE దుర్గాప్రసాద్, EE KVS రాజు, EE గోవర్ధన్ గౌడ్, DE ఆనంద్, DE విశాలాక్షి,DE దుర్గాప్రసాద్, DE రమేష్, DE నిఖిల్, AE జగదీష్ ,AE భాస్కర్, AE ప్రతాప్, AE ప్రశాంత్, AE సంతోష్, AE సంతోష్ రెడ్డి, AE రాజీవ్, AE శ్రావణి, AE సాయి ప్రసన్న, మరియు తదితరులు పాల్గొన్నారు.