Spread the love

విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడును సన్మానించిన ఆకుపాటి మిత్రబృందం

కనిగిరి

కనిగిరి నియోజకవర్గం పామూరు పట్టణంలో విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడును పామూరు రెండవ ప్రదేశికం ఎంపిటిసి ప్రకాశం జిల్లా ఎంపీటీసీల సంఘం అధ్యక్షులు ఆకుపాటి వెంకటేష్ పామూరులో ఘనంగా సన్మానించారు. కనిగిరి ప్రాంతానికి దైవదర్శనం నిమిత్తం అప్పలనాయుడు విచ్చేశారన్న సమాచారం తెలుసుకున్న ఆకు పాటి మిత్రబృందం అప్పలనాయుడు ను ఘనంగా దుశ్యాలతో సత్కరించి పూలమాలతో సన్మానించారు . ఈ కార్యక్రమంలో నీరు కట్టు నాయబ్ రసూల్, చంద్ర, బ్రహ్మనాయుడు, నరసింహారావు, మాల కొండయ్య, మాధవ, రవి, మణి, వెంకటేశ్వర్లు, కార్తీక్, శ్రీకాంత్, రమణయ్య, తదితరులు ఘనంగా అప్పలనాయుడును, కోప్పల్లి సురేష్ ను సన్మానించారు.