బుధ. మార్చి 11th, 2026

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ప్రగతి నగర్ మెయిన్ రోడ్డు వద్ద వాటర్ పైప్ లీకేజీ

WhatsApp Image 2025 02 12 at 12.25.03
WhatsApp Image 2025 02 12 at 12.25.03
TEJA NEWS

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ప్రగతి నగర్ మెయిన్ రోడ్డు వద్ద వాటర్ పైప్ లీకేజీ వల్ల రోడ్డు గుంతలు పడి నిత్యం ట్రాఫిక్ సమస్య వస్తున్నందున, HMWSSB DGM , జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ ఏఈ తో కలసి పరిశీలించి, లీకేజీ మరియు రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . ఈ సందర్భంగా నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ, ప్రగతి నగర్ మెన్ రోడ్డు ప్రసాద్ హాస్పిటల్ జంక్షన్ వద్ద వాటర్ పైప్ లీకేజీ వల్ల రోడ్డు గుంతలు పడి నిత్యం ట్రాఫిక్ సమస్య వస్తున్నందున, HMWSSB DGM , జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ ఏఈ తో కలసి, కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు అధికారులను తీసుకుని వెంటనే సమస్యను పరిష్కరించాలని చెప్పడం జరిగింది అని, అలానే ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని, సంతులిత, సమగ్ర అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు. అదేవిధంగా కాలనీ వాసులు అందరూ కలిసి కాలనీ అభివృద్ధి లో భాగస్వాములు కావాలని, కాలనీ వాసులందరి సమిష్టి కృషి తో ఆదర్శవంతమైన కాలనీ గా తీర్చిదిద్దుతామని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు. ఏ చిన్న సమస్య ఐన తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని, అదేవిధంగా డివిజన్ లో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా కృషి చేస్తామని ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో IHMWSSB DGM నాగప్రియ , జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ ఏఈ రాజీవ్ , వాటర్ లైన్ మెన్ శ్రీకాంత్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Related Post

You cannot copy content of this page