
కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం : బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
125 – గాజులరామారం డివిజన్ సుభాష్ చంద్రబోస్ నగర్ లో దాదాపు 11 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్డు పనులకు బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ…. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులను కల్పించేందుకు గత పదివేల కాలంలో కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధి పరచామని, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, రానున్న రోజుల్లో కూడా నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో హ్యాట్రిక్ విజయాన్ని అందించిన కుత్బుల్లాపూర్ ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటానన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రావుల శేషగిరి, పాక్స్ డైరెక్టర్ పరిశే శ్రీనివాస్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు విజయ్ రాంరెడ్డి, సీనియర్ నాయకులు కస్తూరి బాల్ రాజ్, అడ్వకేట్ కమలాకర్, నవాబ్ భాయ్, చెట్ల వెంకటేష్, సమ్మయ్య యాదవ్, చిన్న చౌదరి, బోయిని మహేష్, ఇమ్రాన్ బేగ్, హమీద్, శివ నాయక్, ఆసిఫ్, ప్రసాద్, సుభాష్ చంద్రబోస్ నగర్ అధ్యక్షులు పత్తి శ్రీనివాస్, కాలనీవాసులు సౌండ్ శేఖర్, చంద్రశేఖర్ గౌడ్, సాయి చంద్, తదితరులు పాల్గొన్నారు.
