
ఏపీలో త్వరలో లక్ష మందికి కుట్టు మిషన్లు ఇస్తాం: మంత్రి
సవిత
అమరావతి : ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా బీసీ, ఈడబ్ల్యూఎస్
వర్గాలకు చెందిన 1.02 లక్షల మంది మహిళలకు టైలరింగ్లో ఉచితంగా శిక్షణతో పాటు కుట్టు మిషన్లు అందిస్తామని మంత్రి సవిత తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని అన్ని నియోజకవర్గాల్లోనూ ఈనెల 8 నుంచి శిక్షణ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. లబ్ధిదారుల వీలుకు అనుగుణంగా 45-90 రోజులపాటు శిక్షణ ఉంటుందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో వీటికి దరఖాస్తులు స్వీకరిస్తారు.
