Spread the love

అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్ఫూర్తితో మహిళా సాధికారత సాధిద్దాం *
నేదునూరి జ్యోతి
మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

శ్రామిక మహిళల పనిగంటల తగ్గింపు కోసం సమాన పనికి సమాన వేతన ల కోసం జీవన పరిస్థితులను మేరుగు కోసం ఆరోగ్య హక్కులు మహిళలకు రక్షణ, నిర్వహించిన మహిళా పోరాటల సాధించిన ఘనతకు నిర్వహించిన మహిళా దినోత్సవాలు ఉత్సవాలుగా మారుతున్నాయని మహిళల హక్కులు హరించబడుతున్నాయని లింగ సమానత్వం మహిళలపై దాడులు పెరుగుతున్నాయని మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి ఆవేదన వెలిగించారు మేడ్చల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో జగద్గిరిగుట్ట సిపిఐ కార్యాలయంలో ఉజ్జిని హైమావతి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సదస్సుకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి జెండా ఆవిష్కరణ చేసి మాట్లాడుతూ కేంద్రాల్లో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత భేటీ పడవో బేటీ బచావో వంటి నినాదాలు కాగితాలకే పరిమితం అయ్యాయని మహిళలపై దాడులు అత్యాచారాలు పెరుగుతున్న నిందితులను బహిరంగంగా సమర్ధించడం జరుగుతుందని ఆసిఫా ఉన్నావ్ అత్రాస్ బిలకీస్ భానో మణిపూర్ లాంటి దారుణ సంఘటనలలో న్యాయం కొరకు ఏ ళ్ల తరబడి పోరాడవలసిన పరిస్థితి దాపురించిందని జ్యోతి విమర్శించారు సనాతన ధర్మం పేరుతో మహిళలను రెండవ స్థాయి పౌరులుగా చూస్తున్నారని రాజకీయ స్వార్థం కోసం మహిళలపై అసభ్య వ్యా ఖ్యలు చేస్తున్నారని మహిళల వ్యాపార వస్తువుగా చూస్తున్నారని మద్యం మత్తులో మహిళలపై హింస పెరిగిపోతుందని వీటిని అరికట్టడంలో పాలకులు తీవ్రంగా విపల మైనారని ఆరోపించారు మహిళలపై అత్యాచారాలు అరికట్టడానికి సామాజిక అసమానతలు రూపుమాపడానికి మహిళలంతా ఐక్య ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు మహిళా సమాఖ్య రాష్ట్ర కోశాధికారి J. లక్ష్మి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందని విచ్చలవిడిగా బెల్ట్ షాపులకు లైసెన్సులు ఇవ్వడం వల్ల మద్యం మత్తులో మహిళలపై దాడులకు పాల్పడుతున్నారని గంజాయి వంటి మాదకద్రవ్యాలు మత్తులో యువత పక్కదోన పడుతున్నారని పబ్బుల సంస్కృతితో నాగరిక పేరుతో విష సంస్కృతి విలయ తాండవం చేస్తుందని పోరాడు సాధించుకున్న చట్టాలు అమలుకు నోచుకోవడం లేదని అసంఘటిత రంగాలలో పనిచేసే మహిళలకు సరైన వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారని పోషకాహారం లోపంతోటి చాలామంది మహిళలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారని అందరికీ ఆరోగ్యం అందరికీ విద్య బాధ్యత ప్రభుత్వాలు దే నని లక్ష్మి డిమాండ్ చేశారు *
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు మాధవి, సహాయ కార్యదర్శి ప్రమీల, నర్సమ్మ, P. సింధురి, అరుణ దేవి v. లక్ష్మి, మహేశ్వరి, గోవిందమ్మ, కీర్తన, Ch. నాగమణి, సోమేశ్వరి తదితరులు పాల్గొన్నారు.