Spread the love

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సన్మానించిన ఎమ్మెల్యే నాగరాజు ….

హనుమకొండ జిల్లా…

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళ దినోత్సవం సందర్భంగా నేడు హనుమకొండ సుబేదారి లోని ఎమ్మెల్యే నివాస క్యాంపు కార్యాలయం నందు మహిళలతో కలసి కేక్ కట్ చేయించి శాలువాతో సన్మానించి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసిన గౌరవ వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ….

అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ:-….

ప్రతి మహిళా శక్తి ధీరత్వం, వీరత్వం ,మాతృత్వం కలగిన ఒక ధృడమైన బలం గల మహిళా తెలంగాణ ఉజ్జ్వల భవిష్యత్తు మన మహిళలలే..

ప్రజా పాలన ప్రభుత్వంలో మహిళా సాధికారత దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందుకు వెళ్తుంది.

ఆర్టీసీ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం , గృహ లక్ష్మి ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్,500 కి గ్యాస్ ,కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ఇందిరా మహిళా శక్తి మిషన్ -2025

ఆర్టీసీ లో మహిళా సమైక్య సంఘాల ద్వారా ఇందిరా మహిళా శక్తి ద్వారా బస్సులకు యజమానులను చేసి వారిలో ఆర్థిక వృద్ధి సాధించడం..

ఇలా ఎన్నో పథకాల తో తెలంగాణ లో ఇందిరమ్మ ప్రభుత్వం మహిళా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తూ దేశానికి తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తుంది.

ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ నా శుభాకాంక్షలు అభినందనలు అని తెలియజేశారు…

ఈ కార్యక్రమంలో మహిళ కాంగ్రెస్ నాయకులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు….