Spread the love

అంబీర్ చెరువులో మురుగు నీరు కలవకుండా చర్యలు చేపట్టాలి : బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అంబీర్ చెరువు పరిరక్షణకై చేపట్టవలసిన చర్యలపై బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ అధికారులు, నిజాంపేట్ కార్పొరేషన్ కు చెందిన ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ…. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిషన్ కాకతీయ పథకం కింద ఎన్నో చెరువులను అభివృద్ధిపరిచి మురుగునీరు కలవకుండా మురుగునీరు మళ్లింపు చర్యలు చేపట్టి సమీప కాలనీ వాసులకు ఉపయోగపడేలా ఆహ్లాదకర వాతావరణాన్ని ఏర్పాటు చేసే విధంగా చెరువులను అభివృద్ధి పరచామన్నారు. అదేవిధంగా అంబీర్ చెరువులో కూడా మురుగునీరు కలవకుండా మురుగునీరు మళ్లింపు చర్యలను చేపట్టాలని ఇరిగేషన్ అధికారులను, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అనంతరం నిజాంపేట్ కార్పొరేషన్ పరిధి 22వ డివిజన్ ఎన్ఆర్ఐ కాలనీలో అసంపూర్తిగా మిగిలిపోయిన సిసి రోడ్డు, డ్రైనేజీ పనులపై కాలనీవాసులు సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను వెంటనే పూర్తిచేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, ఇరిగేషన్ డిఈ నరేంద్ర, మున్సిపల్ డీఈ దాసయ్య, ఏఈ లక్ష్మీ నారాయణ, నాయకులు శ్రీకర్ గుప్తా, జశ్వంత్, సాంబశివారెడ్డి, శిల్ప, సాయి, ప్రదీప్, గురుమూర్తి, ఎన్ఆర్ఐ కాలనీ వాసులు సాయిరాజ్, సుబ్బరాజు, శివ, తేజ, త్రినేత్ర రావు తదితరులు పాల్గొన్నారు.