
అన్ని వర్గాల సంక్షేమమే కూటమి ప్రభుత్వధ్యేయం
ఎమ్మెల్యే సుజనా చౌదరి
అన్ని వర్గాల ప్రజల సంక్షేమం ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు .భవానిపురంలోని ఎన్డీయే కార్యాలయంలో ఆయన మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. కంపెనీ సోషల్ రెస్పాన్సిబిలిటీ
(సి ఎస్ ఆర్) ప్రొగ్రాం లో భాగంగా కోలిండియా లిమిటెడ్ రోటరీ మిడ్ టౌన్ వారి సహకారంతో గతంలో టైలరింగ్ లో మహిళలకు శిక్షణ ఇచ్చారు.. శిక్షణ పూర్తి చేసుకున్న ఐదుగురు మహిళలకు సోమవారం కుట్టు మిషన్లు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం తగిన ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. మహిళలు ఆర్థికంగా అభ్యున్నతి పొందడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా దినోత్సవం నాడు రాష్ట్రవ్యాప్తంగా కుట్టు మిషన్ల శిక్షణ కేంద్రాలను ప్రారంభించారని తెలిపారు. అదే విధంగా కార్పొరేట్, స్వచ్ఛంద సంస్థల ద్వారా
మహిళలకు టైలరింగ్ లో శిక్షణ ఇచ్చి అనంతరం ఉచితంగా కుట్టుమిషన్లను పంపిణీ చేస్తున్నామన్నారు.
మహిళలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సుజనా పిలుపునిచ్చారు. కూటమి
పది నెలల పాలనలో
పశ్చిమ లో సుజనా ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ఉచిత మెడికల్ క్యాంపులను నిర్వహిస్తున్నామన్నారు. విద్యారంగం బలోపేతమే లక్ష్యంగా సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీడ్స్ ఫౌండేషన్ సహకారంతో విజయ దీపం కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు.
నిరుపేదలకు అండగా సీఎం ఆర్ ఎఫ్
నిరుపేదలకు కొండంత అండగా సీఎంఆర్ఎఫ్ నిలుస్తుందని సుజనా చౌదరి అన్నారు. పశ్చిమ నియోజకవర్గం లోని లబ్ధిదారులకు రూ 30 లక్షల 86 వేల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎన్డీయే కార్యాలయంలో పంపిణీ చేశారు . పేదలకు ముఖ్యమంత్రి సహాయనిది ఎంతో భరోసానిస్తుందన్నారు.
కార్యక్రమంలో ఎన్డీయే కూటమి నేతలు పైలా సోమినాయుడు, బుల్లా విజయ్ కుమార్, యేదుపాటి రామయ్య, ముదిగొండ శివ, దేవిన హరిప్రసాద్, పచ్చిపులుసు ప్రసాద్,
మహేష్,వెంపలి గౌరీ శంకర్, తిరుపతి అనూష, రౌతు రమ్య ప్రియ తదితరులు పాల్గొన్నారు.
