
ఎస్సీ వర్గీకరణ చట్టం అయ్యేవరకు ఉద్యోగాల భర్తీ నిలిపేయాలి’
ఎస్సీ వర్గీకరణ చట్టం అయ్యేవరకు ఉద్యోగాల భర్తీ నిలిపివేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమాజిగూడలో ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ లేకుండా ఉద్యోగాల భర్తీ ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఆగమేఘాల మీద ఉద్యోగాల భర్తీ చేయాలని చూడటం, గ్రూప్ 1, 2తో పాటు అనేక పోస్టులకు వారంలోనే ఫలితాలు ప్రకటించటం ఎస్సీలకు అన్యాయం చేస్తున్నారన్నారు.
