
- ఓటే నీ భవిష్యత్తును మార్చేస్తుంది
కవులు, రచయితలు పాలించే స్వర్ణ యుగం రావాలి
వనపర్తి
మనువాదాన్ని
అగ్రవర్ణాల అధిపత్యాన్ని తగ్గించేందుకు అణగారిన వర్గాలకు ఓటు హక్కు అనే ఆయుధాన్ని అందించింది అంబేద్కర్ రాజ్యాంగంఅని నీవు వేసే ఓటు నీ పేదరికాన్ని భవిష్యత్తును మార్చేస్తుందని
నేడు చేస్తున్ననాయకుల యాత్ర ఓటు యాత్రేనని రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే సరైన శాసనకర్తలు రావాల్సి ఉంటుందని సరైన నాయకుల ఎన్నిక జరగకపోతే రాజ్యాంగ స్ఫూర్తి నెరవేరదని జిల్లా కేంద్రంలో టీఎన్జీవో భవనంలో ఏర్పాటు చేసిన విముక్తి పుస్తకావిష్కరణలో రచయిత తన రచన ముఖ్య ఉద్దేశాన్ని ముఖ్య అతిథులు డాక్టర్ మురళీధర్ , వక్తలు అభివర్ణించారు రాజ్యాంగాన్ని రచించి 77 సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ సంపండ వర్గాలు ఆ ఓటు విలువ తెలుసుకోక ఓట్లు వారికి వేసి సీట్లు కావాలని వారి ముందు బానిసలుగా తలదించుకోవడమేమిటిని ఆవేదన వ్యక్తం చేస్తూ ఇలాంటి పరిస్థితుల్లో అధ్యాపకులుగా కొనసాగుతూనే 30 సంవత్సరాల బహుజనుల విముక్తి కోసం పోరాడిన అక్కల బాబు గౌడ్ కలం లోంచి ఆవిష్కరింపబడిందే 28 సంపుటాల విముక్తి పుస్తక రూపమని అభివర్ణించారు కవులు రచయితలు జనజ్వాల సాహితీ కళావేదిక అధ్యక్షులు శంకర్ గౌడ్ పలువురు కవులు రచయితలు మాట్లాడుతూ తలదించుకొని పుస్తకాన్ని చదువు సమాజంలో నిన్ను తల ఎత్తుకునే విధంగా చేస్తానని పుస్తకం చెబుతుందని సరస్వతీ పుత్రులు కవులు రచయితలని సమాజ హితాన్ని కోరేవారు కవులు రచయితలని వారిని గౌరవించే సమాజాలను కవులు రచయితలు పాలిస్తే చూడాలని అలాంటి స్వర్ణ యుగం రావాలని అభిలాషించారు చివరగా వర్ణ వ్యవస్థ లోంచి ఆనగారిన వ్యవస్థ పైకి రావాలన్నా స్ఫూర్తియే ఈ సంకలన సృష్టి అని కవి రచయిత అక్కల బాబు గౌడ్ వ్యక్తీకరించారు ఈ కార్యక్రమంలో సినారె అవార్డు గ్రహీత సత్తార్ ప్రొఫెసర్ షఫీ సత్యం సాగర్ బాలకృష్ణ శ్రీలత డా. అనంతప్ప డా.రాములు జ.రాములు మద్దిలేటి సాహితీ ప్రియులు తదితరులు పాల్గొన్నారు
