Spread the love

కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర కృషితో సిజేరియన్ సేవలు ప్రారంభం

అధునాతనం గా నిర్మించిన ఆపరేషన్ థియేటర్‌ లో తిరిగి మొదలైన ప్రసవ సేవలు

వైద్యులను అభినందించిన ఎమ్మెల్యే Dr ఉగ్రనరసింహారెడ్డి

కనిగిరి

కనిగిరి నియోజకవర్గం కనిగిరి ప్రభుత్వాసుపత్రిలో పది సంవత్సరాల విరామం తర్వాత సిజేరియన్ ప్రసవ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి.తాజాగా ఆధునీకరించిన ఆపరేషన్ థియేటర్‌లో సిజేరియన్ ప్రసవం విజయవంతంగా నిర్వహించడం గర్వకారణంగా మారింది.
ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ప్రభుత్వ ఆసుపత్రి సౌకర్యాలను మెరుగుపర్చేందుకు ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి నిరంతరం కృషి చేశారు.
సీఎం చంద్రబాబు, మంత్రి సత్యకుమార్ యాదవ్, కలెక్టర్ తమీమ్ అన్సారీయ సలహాతో ఈ CHC లో కంగారు మదర్ కేర్ విధానాన్ని తీసుకొచ్చారు. ఉగ్ర నరసింహారెడ్డి పట్టుదలతో ఆసుపత్రికి నూతన పరికరాలు, సౌకర్యాలు దాతల సహకారం వల్లే ఈ సేవలు పునరుద్ధరించగలిగారు.
ఆసుపత్రిలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఆపరేషన్ థియేటర్ ఏర్పాటుకావడంతో ఇకపై సిజేరియన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
గత 10 ఏళ్లుగా సిజేరియన్ ప్రసవం కోసం ప్రైవేట్ హాస్పిటల్ ఎంతో ఖర్చుతో వైద్య సేవలు పొందాల్సిన పరిస్థితి ఉండేది.


ఇంకొందరు సిజేరియన్ ప్రసవం కోసం దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సిన అవసరం ఉడేది.
అయితే ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసి హాస్పిటల్ అధినీకరణ చేసి సిజేరియన్ ఉచితంగా చేయడంతో వారికి వైద్య ఖర్చులు, ప్రయాణ ఖర్చులు మిగిలాయి.
ఇప్పుడు ప్రభుత్వాస్పత్రిలో సిజేరియన్ సేవలు అందుబాటులోకి తీసుకు రావడం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సేవలు ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన ఎమ్మెల్యే గారికి మరియు వైద్యులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
హాస్పిటల్ లో సిజేరియన్ ప్రసవం విజయవంతంగా పూర్తి చేసిన వైద్యులను ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి అభినందించారు.
కనిగిరి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తన వంతు కృషి కొనసాగిస్తానని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి తెలిపారు.