Spread the love

కోదాడ ఆర్టీసీ డిపో నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

కోదాడ సూర్యపేట జిల్లా)

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కోదాడ ఆర్టీసీ కార్యాలయం నందు ఏర్పాటు చేసినటువంటి మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా తిరుమల హాస్పిటల్ ప్రముఖ వైద్యురాలు ప్రమీల పాల్గొని మహిళ దినోత్సవ వేడుకలను డిపో నందు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోదాడ డిపో మహిళ ఉద్యోగస్తురాలు సీఐ నాగశ్రీ కి మహిళ కండక్టర్ లు పుష్పగుచ్చం అందజేసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డి ఎం. శ్రీ హర్ష, సీఐ. నాగశ్రీ, ఏడిసి జిఎం రావు, మహిళా కండక్టర్లు తోళ్ల భవాని, చుక్కమ్మ, జ్యోతి, శ్రీదేవి, సుభద్ర, సుధారాణి, శైలజా, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.