Spread the love

చందానగర్ సర్కిల్ పరిధిలో నెలకొన్న పలు సమస్యలు మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి సమీక్షా సమావేశం జరిపిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ చెరువులను స్వచ్చందంగా దత్తత తీసుకొని CSR నిధులతో సుందరికరణ మరియు అభివృద్ధి పనులు చేపడుతున్నామని, చెరువుల సుందరికరణలో భాగంగా పటేల్ చెరువు , గంగారాం పెద్ద చెరువు ల సుందరికరణ లో భాగంగా న్యాయ చిక్కులు ఏర్పడటంవలన కోర్ట్ పరిధిలో ఉండటం వలన సుందరికరణ పనులకు ఆటంకం ఏర్పడినది అని, పనులలో జాప్యం నెలకొంది అని, త్వరితగతిన న్యాయ వివాదాలు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని, TDR వంటి అంశాలు త్వరితగతిన పూర్తి అయ్యేలా చూసి పనులు త్వరితగతిన ప్రారంభించాలని అధికారులకు PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు. కైదమ్మ కుంట చెరువు సుందరికరణ కు తోడ్పాటును అందించాలని, చెరువుల సుందరికరణ కు సహకరించాలని, చెరువుల సుందరికరణను వేగవంతం చేస్తామని నియోజకవర్గంలో గల ప్రతి చెరువును సుందర శోభితవనంగా తీర్చిదిద్దుతామని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు. దశల వారిగా అన్ని చెరువులను సుందర శోభిత వనంగా తీర్చిదిద్దుతామని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు. అధికారులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ చెరువుల సుందరికరణ పనులలో బాగస్వామ్యులు కావాలని PAC చైర్మన్ గాంధీ పిలుపునిచ్చారు.

అదేవిధంగా రోడ్లు, లింక్ రోడ్లకు ,రోడ్ల విస్తరణ పనులకు ఎటువంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, సాంకేతిక ప్రాసెస్ త్వరితగతిన జరిగేలా చూడాలని మరియు

శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేసే విధంగా ప్రజల మెరుగైన జీవన ప్రమాణాల కోసం, ట్రాఫిక్ రహిత సమాజం కోసం మరిన్ని లింక్ రోడ్లు ఏర్పాటు చేయాలని,స్థల సేకరణ జరిగి పెండింగ్ లో ఉన్న లింకు రోడ్లు త్వరితగతిన పూర్తి చేయాలని ,అసంపూర్తిగా మిగిలిపోయిన నాలాల త్వరగా పూర్తయ్యేలా చూడలని PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారులు ACP నాగిరెడ్డి, TPS రాకేష్, సర్వేయర్ జగదీశ్వర్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.