
పిఠాపురంలో జనసేన
ఆవిర్భావ సభకు సర్వం సిద్ధం
పిఠాపురం: ఏపీలో జనసేన పార్టీ ఆవిర్భావ సభకు సర్వం సిద్ధమైంది. జనసేనపార్టీ పెట్టి 12 ఏళ్లు అవుతున్న సందర్భంగా రేపటి నుంచి మూడు రోజులపాటు పార్టీ ఆవిర్భావ సభను కాకినాడ జిల్లా పిఠాపురంలో నిర్వహిస్తున్నారు. దీంతో సభకు వచ్చే జనసైనికుల కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. వాహనాల్లో వచ్చే వారికి కోసం 5 చోట్ల పార్కింగ్ సౌకర్యం కల్పించారు.
