
పేట మున్సిపల్ ఛైర్మన్ షేక్ రఫానీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు
చిలకలూరిపేట : పట్టణంలోని స్థానిక విశ్వనాధ దియటర్ ఆవరణలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు శుక్రవారం నాడు ఇఫ్తార్ విందునుఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలోఉపవాస దీక్షలు ఉంటున్న ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రార్థనలు చేశారు,ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్మన్ షేక్ రఫానీ మాట్లాడుతూ రంజాన్ మాసం అత్యంత పవిత్రమైందనీ, ఈ మాసంలో ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు ఉండి సమాజం లో ప్రతి ఒక్కరినీ సుఖ సంతోషాలతో జీవించాలని అందరు ఐకమత్యం తో మెలగాలని సోదర భావంతో ఉండలని, ఆ అల్లాను వేడు కుంటారని అన్నారు, విశ్వమానవాళి శాంతికి రంజాన్ ప్రతీక అని వారు పేర్కొన్నారు.
