
పోసాని విడుదలకు బ్రేక్!
AP: వైసీపీ మద్దతుదారు పోసాని కృష్ణమురళి విడుదలకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఆయన కోసం గుంటూరు సీఐడీ పోలీసులు కర్నూలు జిల్లా జైలు వద్దకు వెళ్లి పీటీ వారెంట్ వేశారు. దీంతో ఆయన్ను వర్చువల్ జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు. కాగా, పోసానిపై నమోదైన కేసుల్లో బెయిల్ రాగా విడుదల అవుతారని వార్తలొచ్చాయి. తాజాగా సీఐడీ పీటీ వారెంట్ దాఖలుతో విడుదల నిలిచిపోనున్నట్లు సమాచారం.
