
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కు 50 వినతులు.
కమిషనర్ ఎన్.మౌర్య
తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కు 50 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫోన్ ద్వారా 10 మంది తమ సమస్యలు తెలుపగా, 40 మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు. డిప్యూటీ మేయర్ ఆర్.సి. మునికృష్ణ, కార్పొరేటర్ కుడితి సుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ వార్డుల, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ చేపల మార్కెట్ వద్ద వ్యర్థాలు కాలువల్లో వేయడం వలన దుర్గంధం వస్తోంది పరిష్కరించాలని, ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు ప్రారంభించాలని కార్పొరేటర్ ఎస్.కే.బాబు కోరారు, తొండమాన్ చక్రవర్తి మార్గంలో కాలువలు లేనందున మురుగు నీరు ఇండ్లలోనికి వస్తున్నాయి పరిష్కరించాలని, పశుపర్తి సూపర్ మార్కెట్ వద్ద బోరు మరమ్మత్తులు చేయాలని, యుడిఎస్ సమస్య పరిష్కరించాలని, నగరపాలక సంస్థ ఔట్ సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న నా భర్త మృతించాడని, తనకు జీవనోపాధి కల్పించాలని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, ఇంటి పైన వాలిన చెట్టును తొలగించాలని, నీటి కొళాయి పన్ను ఎక్కువ వస్తోంది సరిచేయాలని, సంజీవయ్య నగర్లో రాకపోకల కోసం ఉన్న దారి ఆక్రమించారు శరచేయాలని, అన్నమయ్య నగర్, గోవింద నగర్ వద్ద ఆలయ నిర్మాణం పేరుతో అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారు అడ్డుకోవాలని కోరారని తెలిపారు. ఆయా విభాగాల అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్ తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, డి.ఈ.లు, ఏసిపి లు, తదితరులు ఉన్నారు.
