Spread the love

ప్రతి మహిళ విద్యావంతురాలు కావాలి.
తుడా ఉపాధ్యక్షులు ఎన్.మౌర్య

ప్రతి మహిళ విద్యావంతులు కావాలని అప్పుడే ఆ కుటుంబం ఆర్థికంగా ఎదుగుదల సాధిస్తుందని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ఉపాధ్యక్షులు ఎన్.మౌర్య అన్నారు. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యక్షులు ఎన్.మౌర్య, మహిళా ఉద్యోగులు కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు మాట్లాడుతూ మహిళలు విద్యా వంతులు అయితే ఆ కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. నేడు ప్రతి రంగంలో మహిళలు రాణిస్తున్నారని అన్నారు. ప్రతి మహిళ విజయం వెనుక ఒక పురుషుడు ఉంటారని అన్నారు. మన విజయానికి కారణమైన తండ్రి, భర్త, సోదరుడు, కుమారుడు ఐనా ఈ మహిళా దినోత్సవం రోజు గుర్తుంచుకోవాలని అన్నారు. ముఖ్యంగా ప్రతి ఆడబిడ్డను కనీసం డిగ్రీ వరకు చదివించి, వాళ్ళ కాళ్ళ మీద వారు నిలబడే వరకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలని అన్నారు. చిన్నతనంలో పెళ్ళిళ్ళు చేయవద్దని, వారు చదువుకుంటేనే వారు సొంతంగా నిర్ణయాలు తీసుకోగలరని అన్నారు. తుడా లో ఎక్కువ మంది మహిళా ఉద్యోగులు ఉన్నారని పరస్పరం సహకరించుకుని మీ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ మహిళా దినోత్సవ వేడుకల్లో కార్యదర్శి వెంకట నారాయణ , సూపరింటెండెంట్ ఇంజినీర్ కృష్ణారెడ్డి, సి.పి.ఓ. దేవికుమారి, ఈఈ రవీంద్ర, ఎల్.ఏ.ఓ.సృజన, ఉద్యానవన శాఖాధికారి మాలతి, మేఘన, గాయత్రి, హరిని, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.