
ప్లాస్టిక్ వాడకం నిషేధం, వినియోగించిన, అమ్మకం జరిపిన కఠిన చర్యలు తప్పవు. కమిషనర్ పి. శ్రీహరిబాబు
ముఖ్యమంత్రి వారి ఆదేశముల ప్రకారం ప్రతి 3వ స్వచ్ఛ ఆంధ్ర -స్వర్ణ ఆంధ్ర కార్యక్రమము లో భాగముగా ది. 08.03.2025న మున్సిపల్ కార్యాలయము లోని కమీషనర్ ఛాంబర్ నందు మునిసిపల్ కమీషనర్ పి. శ్రీహరి బాబు అధ్యక్షతన ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులతో, ప్లాస్టిక్ హోల్ సేల్ మరియు రిటైల్ వర్తక సంఘాలు, వివిధ వర్తక వ్యాపార సంఘ సభ్యులతో సమావేశము నిర్వహించడం జరిగినది, ఈ సందర్భముగా కమీషనర్ మాట్లాడుతూ ది. 15.03.2025నుండి చిలకలూరిపేట పట్టణంలో పూర్తిగా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించడమైనది అని వీటికి బదులుగా ప్రజలు క్లాత్, నూలు మరియు జనపనారతో తయారు చేసిన బ్యాగులు వాడవలెను అని తెలిపియున్నారు, అదే విధముగా పట్టణము లో ప్లాస్టిక్ కవర్లు మరియు సింగిల్ యూస్ ప్లాస్టిక్ వినియోగించిన లేదా అమ్మిన యెడల రూ 2,500/- నుండి రూ. 5,000/- ల వరకు జరిమానా విధించబడును అని తెలియజేయడమైనది. కావున దీనికీ అందరు పట్టణ ప్రజలు మరియు వ్యాపార వర్తకులు అందరు సహకరించి చిలకలూరిపేట పట్టణమును ప్లాస్టిక్ రహిత పట్టణముగా తీర్చి దిద్దుటకు సహకరించాలి అని కోరారు.ఈ కార్యక్రమము లో కమీషనర్ తో శానిటేరి ఇన్స్పెక్టర్లు Chnv రమణ రావు, ch. సునీత మరియు శానిటరి సెక్రట్రి లు పాల్గున్నారు.
