Spread the love

బీసీ మంత్రం.. అన్ని పార్టీలదీ అదే తంత్రం..

కులగణనపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. అసలు కేటీఆర్, ఆ పార్టీకి సంబంధించిన నేతలు.. ముఖ్యంగా ఆయన కుటుంబమే సర్వేలో పాల్గొనకుండా.. కులగణన శాస్త్రీయంగా జరగలేదని ఎలా చెబుతారని, రీ సర్వే చేయమని ఎందుకు అదుగుతున్నారని.. ఇదంతా కుట్ర చేసే ప్రయత్నమని కాంగ్రెస్ నేతలు అన్నారు. కావాలనే రాజకీయం చేస్తున్నారే తప్ప.. కులగణనలో ఎటువంటి ఇబ్బందులు లేవని అన్నారు.

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఎక్కడా కులగణనకు సంబంధించి సర్వే చేయలేదని.. పూర్తి స్థాయిలో లక్ష మందికిపైగా సిబ్బందిని ఉపయోగించి తెలంగాణ రాష్ట్రంలో శాస్త్రీయంగా సర్వే చేశామంటూ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. తదనుగుణంగా పథకాలు, రిజర్వేషన్లు ఉంటాయని.. అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. బీఆర్ఎస్ గత పదేళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ ఎందుకు కులగణనకు సంబంధించి సర్వే చేయలేదని, ఇవాళ ఎందుకు విమర్శలు చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ ప్రశ్నించారు. కులగణనపై బీజేపీకి మాట్లాడే అర్హత లేదని అంటున్నారు. బీజేపీ (BJP) పాలిత రాష్ట్రాలల్లో ఇప్పటి వరకు కులగణనకు సంబంధించి సర్వే చేవారా.. బీసీలకు న్యాయం చేశారా.. మరి ఇవాళ బీసీల గురించి బీజేపీ ఎందుకు మాట్లాదుతోందని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు.

కాగా నిన్న (ఆదివారం) బీసీలతో సమావేశం నిర్వహించిన అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ చాలా విషయాల గురించి చర్చించామని.. రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన కులగణన సర్వే నివేదిక ఓ చిత్తుకాగితంతో సమానమని అన్నారు. బీసీ డిక్లరేషన్‌లో 42 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామన్న కాంగ్రెస్‌.. ఇప్పుడు పార్టీపరంగా బీసీలకు 42 శాతం ఇస్తామనడం తగదన్నారు. ఖచ్చితంగా ఆ రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనంటూ కేటీఆర్ అన్నారు. అలాగే శాస్త్రీయత లేదని, సర్వేకు సంబంధించి రీ సర్వే చేయాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు.

బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. అసలు కేటీఆర్, ఆ పార్టీకి సంబంధించిన నేతలు.. ముఖ్యంగా ఆయన కుటుంబమే సర్వేలో పాల్గొనకుండా.. కులగణన శాస్త్రీయంగా జరగలేదని ఎలా చెబుతారని, రీ సర్వే చేయమని ఎందుకు అదుగుతున్నారని.. ఇదంతా కుట్ర చేసే ప్రయత్నమని కాంగ్రెస్ నేతలు అన్నారు. కావాలనే రాజకీయం చేస్తున్నారే తప్ప.. కులగణనలో ఎటువంటి ఇబ్బందులు లేవని అన్నారు. 42 శాతం అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఇచ్చినమాట ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని హరీష్ రావు డిమాండ్ చేశారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్‌ది ఒకే విధానంగా కనిపిస్తోందని.. గతం నుంచి ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారని.. ఆ రెండు పార్టీలు కలిసే వెళుతున్నాయని.. బీసీల్లో ముస్లింలను చేర్చే ప్రయత్నం చేసి.. ఇక్కడ బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపించారు. దీనిపై తాము కూడా ఉద్యమిస్తామని చెబుతున్నారు.

దీనిపై భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. గతంలో కాంగ్రెస్ బిసీ డిక్లరేషన్ ఎక్కడైతే ప్రకటించిందో ఆదే ప్రాంతంలో పెద్ద ఎత్తున సభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సభకు కేసీఆర్ కూడా హాజరవుతారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అలాగే కులగణణ సర్వే అంశం, ప్రజలకు అందున్న పథకాల గురించి తదనుగుణంగా చేయబోయే పథకాలు తదితర అంశాలపై సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ ఫ్లాన్ చేస్తోంది. అలాగే బీజేపీ కూడా ఉద్యమిస్తామని చెబుతోంది. పార్టీల పోటా పోటీ సభలతో రాష్ట్రంతో రాజకీయం వేడెక్కింది..