
శ్రీకాకుళం జిల్లా పోలీసు.
మహిళలు సంపూర్ణ ఆరోగ్యం తోనే పరిపూర్ణమైన సమాజ ప్రగతి.
మహిళ భద్రతే మొదటి ప్రాధాన్యత.
జిల్లాల్లో ఉన్న మహిళ పోలీసు సిబ్బంది,మహిళ పోలీసులు అందరకీ మెగా ఉచిత వైద్య శిబిరం ద్వార వైద్య పరీక్షలు,ఉచిత మందులు పంపిణి.
జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి ఐపీఎస్.
శ్రీకాకుళం మార్చి 08, సమాజంలోని మహిళలందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పుడే పరిపూర్ణమైన ప్రగతి సాధించగలమని,మహిళల భద్రతకు జిల్లా పోలీసు యంత్రాంగం యొక్క మొదటి ప్రాధాన్యతని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని శనివారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న మహిళా పోలీస్ సిబ్బంది,మహిళా పోలీసులకు జెమ్స్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచితం మెగా మహిళా వైద్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ లాంఛనంగా ప్రారంభించి, జెమ్స్ హాస్పిటల్ వైద్య అధికారులు,సిబ్బందికి వారీ సేవలను గుర్తించి జ్ఞాపికలు ఎస్పీ ప్రధానం చేశారు. ఈ క్రమంలో మహిళా పోలీస్ సిబ్బంది మహిళ పోలీసులకు జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర డిజిపి ఉత్తర్వులు మేరకు జిల్లాలో గత వారం రోజులుగా మహిళా సాధికారత వారోత్సవాల్లో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పాఠశాలలు, కలశాలలు, గ్రామాల్లో పోలీసు అధికారులు, సిబ్బంది సందర్శించి బాలికలు, విద్యార్థినిలతో వ్యాసరచన పోటీలు చిత్రలేఖను డిబేట్ కాంపిటీషన్ ఓపెన్ హౌస్ కార్యక్రమాలు వంటి నిర్వహించి పోలీసులు దైనందన కార్యకలాపాలలో భాగంగా నిత్యం వినియోగించే ఆయుధాలు, సాంకేతిక పరికరాలు పై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించి, విజయవంతంగా మహిళ సాధికారత వారోత్సవాల్లో నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి పోలీసు స్టేషను పరిధిలో ప్రతి పాఠశాల, కలశాలలు, గ్రామాల్లో పోలీసు అధికారులు, సిబ్బంది సందర్శించి బాలికలు, విద్యార్థినిలు, గ్రామీణ మహిళలు కు మహిళల భద్రతకు చేపట్టిన చర్యలను పరిశీలించి, భద్రత ప్రమాణాలు దృష్ట్యా మరింత భద్రత పెంచేలా చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ
