Spread the love

రానున్న ఉగాది, శ్రీరామ నవమి ఉత్సవాల నిమిత్తము ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో,కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ అధ్యక్షతన ఈ రోజు పటాన్చెరు లోని కోదండ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సమావేశంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ , పట్టణ పెద్దలు వేద పండితులతో చర్చించిన అనంతరం ఈ నెల అనగా తేదీ 30/03/2025 ఆదివారం ఉగాది పండుగ..

అలాగే వచ్చే నెల ఏప్రిల్ 6వ తేదిన శ్రీ రామ నవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు.

శ్రీ రామ నవమి ఉత్సవాలు ఏప్రిల్ 4వ తేదీ నుండి 8వ తేది వరకు నిర్వహించనున్నట్లు కార్పొరేటర్ తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి జైపాల్ , మాజీ కార్పొరేటర్ సపాన దేవ్ ,సీనియర్ నాయకులు గూడెం మధుసూధన్ రెడ్డి , మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ , మాజీ జడ్పిటిసి మాణిక్యం , మాజీ ఉప సర్పంచ్ నివర్తి దేవ్ , నాయికోటి రాజు , పటాన్చెరు లోని కుల సంఘాల అధ్యక్షులు, ఆలయ కమిటీ సభ్యులు, పట్టణ ప్రముఖులు, పెద్దలు, పలువురు నాయకులు పాల్గొనడం జరిగింది.