Spread the love

శ్రీకాళహస్తిలో ఘనంగా వైయస్సార్సీపి పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

శ్రీకాళహస్తి వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి సూచనలతో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ఆధ్వర్యంలో వైయస్సార్సీపీ కార్యాలయం నందు 15వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ముందుగా పార్టీ జెండాని ఆవిష్కరించారు మరియు స్వీట్లు పంచారు.

ఈ సందర్భంగా దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ రోజు వైయస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటే నిరుపేద యొక్క పండగ దినం ఈ రాష్ట్రంలో కాదు దేశంలో కాదు ఏ వ్యక్తి అమలు పరిచయం విధంగా నవరత్నాలు అనే పథకాన్ని ప్రతి లబ్ధిదారులకు అందే విధంగా ఘనత మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. అటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీని ప్రారంభించి 15 సంవత్సరంలో  అడుగుపెడుతున్న సందర్భంగా శ్రీకాళహస్తి వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆదేశాలతో పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాని ఆవిష్కకరణ మరియు సంబరాలు చేసుకుంటున్నం. మన ప్రాంతంలో కూడా చూస్తే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం వైయస్సార్సీపీ పార్టీ  ప్రభుత్వంలో ఏ పార్టీ అని చూడకుండా ఏ కులమని చూడకుండా ఏ మతం చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా పథకాలను అందే విధంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది. అయితే ప్రస్తుతం ప్రతి చిన్న విషయానికి కూడా వైయస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ వారికి ఏ పని చేయకూడదని సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడడం చాలా దౌర్భాగ్యమైన విషయం మన రాజ్యాంగం ద్వారా ఎన్నికైనప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా పనిచేయాలని. రాష్ట్రంలో అత్యంత మెజార్టీ ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. ప్రతి నిరుపేద కుటుంబానికి కూడా పథకాలు అమలు చేయాలని తెలియజేశారు. వైయస్సార్సీపి కాంగ్రెస్ పార్టీ నిరుపేదలందరికీ అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందే విధంగా మనమందరం ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఎక్కడ వైయస్సార్సీపి కాంగ్రెస్ పార్టీ జెండా అంటేనే దానికి ఒక్క ధైర్యం ఉందని అది మన వైయస్ రాజశేఖర్ రెడ్డి ద్వారా వచ్చిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి నాయకులు వయ్యాల సుధాకర్ రెడ్డి, కంట ఉదయ్ కుమార్, బాల్ శెట్టి చంద్ర శేఖర్, శ్రీవారి సురేష్, సాధన మున్నా రాయల్,బుల్లెట్  జయ శ్యామ్, డాక్టర్ శంకర్,కొత్త పార్టీ శ్రీనివాస్ రెడ్డి,,కొల్లూరు హరినాథ్ నాయుడు, ఫటాన్ ఫరీద్, ఫాజల్, చింతామణి ఏనాదయ్య, పసల సుమతమ్మ, షర్మిల ఠాగూర్, పసల సురేష్, రఘు, రంగయ్య, ఆరిఫ్,రవి, గుణ, శంకరయ్య, బాబు, చెంచయ్య నాయుడు, వరప్రసాద్ నాయుడు, సుందర రామ్ రెడ్డి, వెంకటేష్, సుధాకర్, అంకయ్య,భారతమ్మ, తదితరులు పాల్గొన్నారు.