
సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
బ్రాహ్మణ వీధిలోని 114,115, వార్డు సచివాలయాలను కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు తో కలిసి ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా బ్రాహ్మణ వీధిలోని సచివాలయాలను సందర్శించారు.
సచివాలయ ఉద్యోగుల పనితీరును ప్రజలకు అందిస్తున్న సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు.
ఉద్యోగులు సమయపాలన కచ్చితంగా పాటించాలన్నారు.
పశ్చిమ లోని గ్రామ, వార్డు
సచివాలయాలను మరింత సమర్థవంతంగా మార్చడానికి 22 డివిజన్ల లో 22 సచివాలయాలను ఏర్పాటు చేయడం వంటి అంశాలను పరిశీలించి సిబ్బంది కొరత లేకుండా చేస్తామన్నారు. సచివాలయ ఉద్యోగుల సమస్యలను కూడ అడిగి తెలుసుకున్నారు.
పర్యటనలో ఎన్డీయే కూటమి నేతలు గోలి శ్రీను, కనకారావు, నూకరాజు, సారేపల్లి రాధాకృష్ణ, అజీజ్, సత్తార్ తదితరులు పాల్గొన్నారు.
