
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే) సందర్భంగా 124 డివిజన్ పరిధిలోని కార్పొరేటర్ కార్యాలయంలో డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ జి.ఎచ్.ఎం.సి పారిశుధ్య కార్మికులను శాలువతో సన్మానించి గౌరవించడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రపంచం నలుమూలలా తమ రెక్కల కష్టంతో పనిచేసే కార్మికులందరు ఏకమై పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి, శ్రామిక వర్గానికి దూరమైన హక్కులను సాధించుకున్న మేడే రోజున కార్మికులను సన్మానించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలందరికీ ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసారు. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, సమ్మారెడ్డి, పోశెట్టిగౌడ్, షౌకత్ అలీ మున్నా, ముజీబ్, యాదగిరి, రాజేందర్, నాగేష్ గౌడ్, మజర్, సాగర్, ఎస్.ఆర్.పి నాగేశ్వర్ నాయక్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
