
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 13వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ ఫేస్ -1&3 లో శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి దేవాలయ 3వ వార్షికోత్సవము ఫిబ్రవరి 16వ తేదీ ఆదివారం రోజు మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ,మాజీ కార్పొరేటర్ ఆవుల పావని జగన్ యాదవ్, ఆలయ కార్యనిర్వాహక కమిటీ సభ్యలు ఆధ్వర్యంలో జరుగుతాయని తెలిపారు. ఈ నెల 16వ తేదీ ఉదయం. 6:15 గంటలకు లక్ష్మీ గణపతి హోమం , 7:45 గంటలకు పంచామృతం, అష్ట ఫలాల అభిషేకం , 9:00 అమ్మవారి అలంకరణ మరియు అమ్మవారి దర్శనం,అనంతరం 1:15 గంటలకు అన్నదాన కార్యక్రమలు నిర్వహిస్తారని తెలిపారు. ఇక్కడకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు,భక్తులు, పోచమ్మ పంతులు శంకర్, గ్రామ పెద్దలు, కాలనీ వాసులు చంద్రయ్య , మల్లేష్, కృష్ణ, రాము, సుధాకర్,అనిల్, మురళి, సికిందర్ ,వెంకటేష్
తదితరులు పాల్గొన్నారు.
