TEJA NEWS

రాష్ట్ర బడ్జెట్ లో విద్యకు 15 శాతం నిధులు కేటాయించాలి

—జిల్లాలో సమస్యల వలంగా మారిన
ప్రభుత్వ పాఠశాలలు.

—మనువాధ భావ జాలం వల్లనే దళితులను విద్యకు దూరం చేసే కుట్ర.

—- డిబిఎఫ్ ఆద్వర్యంలో పాదయాత్ర

—డిబిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రౌతు రమేష్

—రాష్ట్ర ఉపాధ్యక్షులు చుంచు రాజేందర్

రాష్ట్ర బడ్జెట్లో విద్యా రంగానికి 15 శాతం నిధులు కేటాయించాలని,
ప్రభుత్వ విద్యను పరిరక్షించు కోవాలని
నాణ్యమైన, సమాన విద్యను అందించాలని,
విద్య ప్రవేటి కరణనకు వ్యతిరేకంగా ఉద్యమించాలని
దళిత బహుజన ఫ్రంట్ (డిబిఎఫ్) అధ్వర్యంలో పాదయాత్ర చేపట్టామని డిబిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రౌతు రమేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు చుంచు రాజేందర్ తెలిపారు.
హనుమకొండ జిల్లా
హసన్‌పర్తి మండలం ఎల్లాపూర్ గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అక్కడ నుండి మొదలైన పాదయాత్ర హసన్‌పర్తి మండల సెంటర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
హసన్‌ పర్తి తహాసిల్దార్ కార్యాలయం కు పాదయాత్ర చేరుకోని తహాసిల్దార్ చల్లా ప్రసాద్ కి విద్యకు 15 శాతం బడ్జెట్ కేటాయించాలని పాదయాత్ర బృందం వినతి పత్రం అందజేసారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అద్యక్ష, ఉపాధ్యక్షులు రమేష్, కుమార్, చుంచు రాజేందర్
మాట్లాడుతూ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా విద్యాహక్కు కల్పించక పోతె దళితులు చదువుకు దూరమయ్యేవారన్నారు. మనువాద భావజాలం వల్లనె
విద్యకు బడ్జెట్ క్వాలిఫికేషన్ దళితులను విద్యకు దూరం చేసే కుట్ర చేస్తున్నారన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పది వేల పాఠశాలల మూసి వేతకు వ్యతిరేకంగా పొరాడాలని పిలుపు నిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం 15 శాతం విద్యకు బడ్జెట్ కేటాయించాలన్నారు.
ఎన్నికల హామీల అమలును సక్రమంగా చట్ట బద్ధంగా చిత్త శుద్దితో అమలు చేసి
నాణ్యమైన సమానమైన విద్యను అందించాలన్నారు.


24- 25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో కేవలం 7 శాతం నిధులు కేటాయించి తమ హామీని తామే తుంగలో తొక్కిందన్నారు రానున్న బడ్జెట్ లోనైనా ఎన్నికల హామీ ప్రకారం 15 శాతం నిధులు కేటాయించి మాట నిలబెట్టు కోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతులు కరువై విద్యార్థులు సమస్యల మధ్య చదువులు కొన సాగిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అసర్ నివేదిక ప్రకారం 5.4 శాతం పాఠశాలలో టాయిలెట్స్ లేవని 19 శాతం బడులు పాడు బడ్డాయన్నారు. 27శాతం బాలికలకు ముత్రశాలల సౌకర్యం లేవని అసర్ నివేదిక స్పష్టంగా పేర్కొన్నాదన్నారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన అబ్ స్ట్రాక్ నివేదిక ప్రకారం 11.95 శాతం పిల్లలు డ్రాప్ అవుట్ గా మారి బడి బయట ఉన్నారని చెప్పారు.
ఒక్క జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో డ్రాపౌట్ సంఖ్య 29 కి పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన అంతర్జాతీయ మోడల్ స్కూల్ లను ప్రతి మండల కేంద్రంలో ప్రారంభించాలని డిమాండ్ చేశారు. గురుకులాలకు, సంక్షేమ వసతి గృహాలకు పక్కా భవనాలను నిర్మించాలని డిమాండ్ చేశారు.
పాద యాత్ర బృందానికి సామాజిక ఉద్యమకారుడు దుర్గ ప్రసాద్ సంఘిభావం ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో డిబిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చుంచు రాజేందర్, రాష్ట్ర
మహిళ నాయకురాలు బొర్ర సంపూర్ణ, జిల్లా కార్యదర్శులు చుంచు నరేష్, మేకల అనిత, మండల అధ్యక్షులు పసుల దాసు, జిల్లా నాయకులు బౌతు రాధ, గొవిందు అనిత, దోమ కొమురయ్య,65 వ డివిజన్ అధ్యక్షులు ఈసంపల్లి కిరణ్, నాయకులు ఆడేపు రమాదేవి, కళ, మరియ, జయ, సరళ,
అయిలయ్య, రాజు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.