
300 కేజీల గంజాయి సీజ్: సీపీ
ఎల్బీనగర్: ఎస్ఓటి పోలీసులు 300 కిలోల గంజాయిని సీజ్ చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఆయన మాట్లాడుతూ. అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్ ను పోలీసులు అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. అరకు నుంచి మహారాష్ట్రకు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం రావడంతో స్క్రాప్ మెటీరియల్ మధ్యలో గంజాయి పెట్టి తరలిస్తుండగా ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నట్లు వెల్లడించారు.
