ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కు 33 వినతులు. కమిషనర్ ఎన్.మౌర్య
తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కు 33 వినతులు వచ్చాయని డిప్యూటీ కమిషనర్ ఆమరయ్య తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫోన్ ద్వారా 9 మంది తమ సమస్యలు తెలుపగా, 24 మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ భూపాల్ హౌసింగ్ కాలనీ లో వెల్డింగ్ షాపు వలన వచ్చే శబ్దాలతో ఇబ్బందిగా ఉందని,అక్కారం పల్లిలో మూసివేసిన కాలువలు వినియోగంలోకి తేవాలని, కుక్కల బెడద తగ్గేలా చూడాలని, చంద్రశేఖర్ రెడ్డి కాలనిలో యూడీఎస్ కాలువ బ్లాక్ అవుతున్నది శాశ్వత పరిష్కారం చూపాలని, శ్రీకృష్ణ నగర్ లో తుడా ఉద్యోగి రోడ్డు ఆక్రమించి గోడ కట్టారు చర్యలు తీసుకోవాలని, నీటి కనెక్షన్ లేకున్నా బిల్లు వస్తోంది పరిష్కరించాలని, రైతు బజారు వద్ద రోడ్డుపై అమ్మకాలు చేస్తుండడంతో రైతు బజారులో వ్యాపారాలు జరగడం లేదు పరిష్కరించాలని, తిలక్ రోడ్డు, రెడ్డి అండ్ రెడ్డి కాలనీల్లో మురుగు కాలువలు పూర్తిగా పాడయ్యాయి బాగు చేయాలని, కోరమేనుగుంట లో గిఫ్ట్ డీడ్ ఇచ్చినా టిడిఆర్ బాండ్ ఇవ్వలేదని, సిపిఆర్ అపార్ట్మెంట్ వద్ద కాలువపై బండలు తొలగించడంతో చెత్త వేస్తున్నారు పరిశీలించాలని, మురుగు కాలువలు శుభ్రం చేయాలని కోరారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, డి.ఈ.లు, ఏసిపి లు, తదితరులు ఉన్నారు.
