Spread the love

స్థానిక ఎన్నికల్లో బీసీ ఎస్సీ ఎస్టీలకు గాను 42% సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ..

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జగదీష్ గౌడ్ తమ పార్టీ ఆఫీసు నందు సంబరాలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శేర్లింగంపల్లి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీమతి శిరీష సత్తూర్ గౌడ్ , మాజీ కౌన్సిలర్ శ్రీమతి సునీత రెడ్డి , రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీమతి కల్పన ఏకాంత గౌడ్ , సత్య రెడ్డి , రవి గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ సభ్యులు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.