TEJA NEWS

44 జాతీయ రహదారి కొత్తకోట పాలెం వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా ముగ్గురికి గాయాలు
డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడమే ప్రమాదానికి కారణం


వనపర్తి
వనపర్తి జిల్లాలోని 44వ జాతీయ రహదారి కొత్తకోట మండలం పాలెం వద్ద Ts09 z7978 నెంబర్ గల ఆర్టీసీ బస్సు కడప నుంచి సికింద్రాబాద్ వెళ్తుండగా అదుపుతప్పి రోడ్డు కిందికి బస్సు బోల్తా పడింది ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నారని వీరిలో ముగ్గురికి గాయాలు కాగా కొత్తకోట పోలీసులు వనపర్తి ఏరియా హాస్పిటల్ కి అంబులెన్స్ లో తరలించి చికిత్స అందిస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు ప్రమాదానికి ముఖ్య కారణం డ్రైవర్ నిద్రమత్తులో డ్రైవ్ చేయడమే ముఖ్యం కారణమని తెలుస్తోంది ఇదే విషయంపై కొత్తకోట పోలీస్ స్టేషన్కి ఫోన్లో ప్రయత్నించగా ఫ్రెండ్లీ పోలీసులు స్పందించకపోవడం విశేషం