TEJA NEWS

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కు 46 వినతులు.

కమిషనర్ ఎన్.మౌర్య

తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కు 46 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫోన్ ద్వారా నలుగురు తమ సమస్యలు తెలుపగా, 42 మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు. డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, ఆర్.సి.మునికృష్ణలు పాల్గొని అనాథ శవాలను తరలించేందుకు వాహన ఏర్పాటు చేయాలని కమిషనర్ ను కోరారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భవాని నగర్ నందు యు డి ఎస్ బ్లాక్ అయి రోడ్లపై నీరు వెళుతున్నాయి పరిష్కారం చూపాలని, మాస్టర్ ప్లాన్ రోడ్లలో డివైడర్లలో ఉన్న మొక్కలకు నీరు పట్టాలని, రోడ్లకు ఉన్న బోర్డు లు సరి చేయాలని, డబుల్ డెక్కర్ బస్ వినియోగంలోకి తీసుకు రావాలని, తిమ్మినాయుడు పాలెం రోడ్డు పక్కన చిన్న షాపు ఉందని అక్కడికి చేరిన కొంతమంది అంబేడ్కర్ విగ్రహం వద్ద మద్యం తాగి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఆ బంక్ తొలగించాలని, కారుణ్య నియామకంలో ఉద్యోగం ఇప్పించాలని, తమ ఇంటిపక్కన స్థలం కోర్టులో ఉందని అయినా గోడ నిర్మిస్తున్నారు పరిశీలించాలని, టి.కె.స్ట్రీట్ నందు చెత్త వేస్తున్నారు చర్యలు తీసుకోవాలని, కె.బి.లేఔట్ నందు నగరపాలక సంస్థ స్థలం అపరిశుభ్రమగా ఉండడంతో పాములు వస్తున్నాయి శుభ్రం చేయాలని, రాఘవేంద్ర నగర్ నందు ఇంటి పక్కన కుళ్ళిన వ్యర్థాలు వేస్తున్నారు పరిష్కరించాలని, శంకర్ కాలని లో యు డి ఎస్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, వితంతు పింఛను మంజూరు చేయించాలని, ఎస్. కె.ఫాస్ట్ ఫుడ్ పక్కన సందులో చెట్టు కొమ్మలు ఎక్కువగా ఉండడంతో వాహనాలు వెళ్ళేందుకు ఇబ్బందిగా ఉంది పరిష్కరించాలని కోరారని తెలిపారు. ఆయా సమస్యలను బీభాగాల వారికి పంపి వెంటనే పరిష్కరించాలని ఆదేశించాలని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర, డి.ఈ.లు, ఏసిపి లు, తదితరులు ఉన్నారు.