
గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా 4వ కియో నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ ముగింపు పోటీలు.. పాల్గొన్న శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
శేరిలింగంపల్లి లోని గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు స్పోర్ట్స్ అథారిటీ అఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో టిపిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన “4వ కియో నేషనల్ కరాటే ఛాంపియన్షిప్” పోటీల ముగింపు కార్యక్రమంలో టీపిసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ , మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పలువురు ప్రముఖులతో కలిసి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని కరాటేలో గెలుపొందిన వారికీ మెడల్స్, అవార్డులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో గోపాల్ యాదవ్ తెలంగాణ కరాటే అసోసియేషన్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.
