TEJA NEWS

ముందస్తు పన్ను చెల్లింపునపై 5% రాయితీ .. మున్సిపల్ కమిషనర్ పీ. శ్రీహరి బాబు

చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలోనీ ఆస్తి పన్నును ముందస్తుగా చెల్లించి 5% రాయితీ పొందాలని పట్టణ ప్రజలకు కమిషనర్ పి. హరిబాబు ఒక ప్రకటనలో కోరారు. 2025-26వ అర్ధ, రెండవ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భవనాలు ఖాళీ స్థలం పన్నులను ఈనెల 30 లోగా చెల్లెస్తే 5% పన్ను రాయితీ వర్తిస్తుందని, మే నుండి ఎటువంటి రాయితీ వర్తించదని పేర్కొన్నారు. పురపాలక సంఘ కార్యాలయంలో, మీ సేవ, ఆన్లైన్ కేంద్రాల్లో, స్థానిక సచివాలయాల్లో పన్నులు చెల్లించవచ్చని,పట్టణ ప్రజలు సదవకాశాన్ని ఉపయోగించుకొని, నగదు ఆదా
చేసుకోగలరని సూచించారు. ఆదివారం మధ్యాహ్నం నుండి నూతన ఆర్థిక సంవత్సర పన్ను డిమాండ్ జనరేట్ అయిందని, పన్నులు చెల్లిస్తేనే పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన సాధ్యమైవుతుందని కమిషనర్ ఉద్ఘాటించారు.